AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Michael Clarke: మైఖేల్‌ క్లార్క్‌ కు చేదు అనుభవం.. గర్ల్‌ఫ్రెండ్‌ చేతిలో చెంప దెబ్బలు తిన్న క్రికెటర్..కారణం అదే..

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. గర్ల్‌ఫ్రెండ్‌ జేడ్‌ యాబ్రో బహిరంగంగా క్లార్క్‌ చెంపలు...

Michael Clarke: మైఖేల్‌ క్లార్క్‌ కు చేదు అనుభవం.. గర్ల్‌ఫ్రెండ్‌ చేతిలో చెంప దెబ్బలు తిన్న క్రికెటర్..కారణం అదే..
Michael Clarke
Ganesh Mudavath
|

Updated on: Jan 20, 2023 | 5:20 PM

Share

ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ క్లార్క్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను మోసం చేసి మరో మహిళతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ.. గర్ల్‌ఫ్రెండ్‌ జేడ్‌ యాబ్రో బహిరంగంగా క్లార్క్‌ చెంపలు వాయించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో క్లార్క్‌.. జేడ్‌కు సర్ది చెప్పేందుకు విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ, ఆమె ఏమాత్రం కన్విన్స్‌ కాకపోగా, మరింత రెచ్చిపోయింది. పలానా రోజు నువ్వు ఆమెతో గడిపావంటూ క్లార్క్‌పై మాటల తూటాలతో దాడి చేసింది. తానే తప్పు చేయలేదని క్లార్క్‌ సంజాయిషీ ఇచ్చినా వినిపించుకోలేదు. ఆ మహిళతో చేసిన ఫోన్‌ చాట్‌ను బయటపెట్టాలని జేడ్‌ డిమాండ్‌ చేసింది. ఆ సమయంలో జేడ్‌ సోదరుడు, అతని భార్య అక్కడే ఉన్నారు.

ఆ ముగ్గురు అక్కడి నుంచి వెళ్తుండగా.. క్లార్క్‌ వారికి అడ్డుతగలడంతో జేడ్‌ మరింత రెచ్చిపోయింది. దుర్భాషలాడుతూ అక్కడి నుంచి వెళ్లి పోయింది. ఈ ఉదంతంపై క్లార్క్‌ స్పందిస్తూ.. బహిరంగంగా ఇలా ప్రవర్తించినందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాడు. కాగా, క్లార్క్‌.. తన భార్య కైలీని వదిలేసి గతకొంతకాలంగా ప్రముఖ మోడల్‌ అయిన జేడ్‌తో సహజీవనం చేస్తున్నాడు.

ఇవి కూడా చదవండి

41 ఏళ్ల క్లార్క్‌.. ఆసీస్‌ తరఫున 115 టెస్ట్‌లు, 245 వన్డేలు, 34 టీ20లు ఆడాడు. టెస్ట్‌ల్లో అతను 28 సెంచరీలు, 27 హాఫ్‌ సెంచరీ సాయంతో 8643 పరగులు చేయగా.. వన్డేల్లో 8 సెంచరీలు, 58 హాఫ్‌ సెంచరీల సాయంతో 7981 పరుగులు చేశాడు. టీ20ల్లో హాఫ్‌ సెంచరీ సాయంతో 488 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో క్లార్క్‌ అత్యధిక స్కోర్‌ 329 నాటౌట్‌గా ఉంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..