BCCI: ‘స్లిమ్‌గా ఉండేవాళ్లే కావాలంటే.. ఫ్యాషన్ షోకి వెళ్లండి.. వారికే బ్యాట్, బాల్ ఇవ్వండి’: సునీల్ గవాస్కర్ ఫైర్..

Sarfaraz Khan: ముంబై తరపున దేశవాళీ క్రికెట్ ఆడే సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాటింగ్ సగటు 80 కంటే ఎక్కువగా ఉంది. అయితే, అతనికి ఇప్పటి వరకు భారత టెస్టు జట్టులో చోటు దక్కకపోవడంతో..

BCCI: 'స్లిమ్‌గా ఉండేవాళ్లే కావాలంటే.. ఫ్యాషన్ షోకి వెళ్లండి.. వారికే బ్యాట్, బాల్ ఇవ్వండి': సునీల్ గవాస్కర్ ఫైర్..
Sunil Gavaskar
Follow us
Venkata Chari

|

Updated on: Jan 20, 2023 | 2:12 PM

క్రికెట్ అభిమానుల నుంచి నిపుణులు, మాజీ క్రికెటర్ల వరకు ప్రస్తుతం అంతా మాట్లాడుతున్న విషయం ఒకటే. దేశవాళీలో అద్భుతంగా రాణిస్తోన్న సర్ఫరాజ్‌ను ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్ట్ సిరీస్‌లో ఎంపిక చేయకపోవడంపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. దేశవాళీ క్రికెట్‌లో గత మూడు సీజన్‌లుగా అద్భుత ప్రదర్శన చేస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు జట్టులో చోటు దక్కించుకోకపోవడంపై బీసీసీఐ సెలక్టర్లపై విమర్శలను ఎక్కుపెట్టారు. గత కొద్ది రోజులుగా సర్ఫరాజ్‌కు మద్దతుగా నిరంతర ప్రకటనలు వెలువడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు వెటరన్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఈ లిస్టులో చేరిపోయాడు. బీసీసీఐ, సెలెక్టర్లపై విరుచుకుపడ్డాడు.

ఆస్ట్రేలియాతో జరిగే భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక కాకపోవడానికి ప్రధాన కారణం అతని ఫిట్‌నెస్ గురించేనని వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. ఇండియా టుడేతో మాట్లడిన సునీల్ గవాస్కర్‌.. తీవ్ర విమర్శలు చేస్తున్నాడు. “మీరు స్లిమ్, ట్రిమ్ అబ్బాయిల కోసం మాత్రమే చూస్తున్నట్లయితే, ఫ్యాషన్ షోకి వెళ్లండి. అక్కడ కొంతమంది మోడల్‌లను ఎంపిక చేసుకుని, వారికి బాల్‌లు, బ్యాట్‌లు ఇచ్చి, ఆపై వారికి క్రికెట్ ఆడటం నేర్పించడం” అంటూ కామెంట్స్ చేశాడు.

గవాస్కర్ మాట్లాడుతూ, ‘క్రికెట్‌లో ఇలా జరగకూడదు. బాడీ సైబ్ ప్రకారం నిర్ణయాలు తీసుకోకూడదు. స్కోరు, వికెట్స్‌ను పరిగణలోకి తీసుకోవాలి. సెంచరీలు చేసిన తర్వాత మైదానం నుంచి బయటకు వెళ్లనివ్వకూడదు. వరుసగా సెంచరీలు చేస్తుంటే అతను పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని తెలుస్తుంది” అంటూ బీసీసీఐకు సూచలను అందించాడు.

ఇవి కూడా చదవండి

‘నిరంతరం అద్భుతంగా ఆడుతంటే ఫిట్‌గా ఉన్నట్లే’

‘ఫిట్‌గా లేకుంటే వరుసగా సెంచరీలు చేయలేరు. క్రికెట్‌కు ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. యో-యో పరీక్ష మాత్రమే ఎంపిక ప్రమాణం కాదు. ఆ వ్యక్తి క్రికెట్‌కు ఫిట్‌గా ఉన్నాడా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నిలకడగా ఆడుతూ ఉంటే, క్రికెట్‌కు ఫిట్‌గా ఉంటే, ఇతర విషయాలకు పట్టింపు లేదు” అంటూ మాజీ దిగ్గజం చెప్పుకొచ్చాడు.

అద్భుతమైన ఫామ్‌లో సర్ఫరాజ్..

సర్ఫరాజ్ ఖాన్ బ్యాట్ గత మూడు సీజన్‌లుగా దేశవాళీ క్రికెట్‌లో చాలా పరుగులు చేస్తోంది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, ఈ బ్యాట్స్‌మెన్ 2019-20లో 154.66 సగటుతో 928 పరుగులు చేశాడు. ఆ తర్వాత, 2021-22లో, అతను 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. 2022-23 సీజన్‌లో కూడా అతను ఇప్పటివరకు 900 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. ఇప్పటివరకు 37 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 53 ఇన్నింగ్స్‌లలో మూడున్నర వేలకు పైగా పరుగులు చేశాడు. ఇక్కడ అతని బ్యాటింగ్ సగటు 80 కంటే ఎక్కువగా నిలిచింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో బ్యాటింగ్ సగటు పరంగా, సర్ఫరాజ్ లెజెండ్ ఆస్ట్రేలియా క్రికెటర్ డాన్ బ్రాడ్‌మాన్ తర్వాత రెండవ స్థానంలో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?