AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫాదర్ కార్పెంటర్.. అబ్బాయిలతో గల్లీ క్రికెట్.. కట్ చేస్తే.. అరంగేట్రంలో టీమిండియా ప్లేయర్ తుఫాన్ ఇన్నింగ్స్‌..

India Women vs South Africa Women: అమంజోత్ కౌర్ 41 పరుగులతో టీమిడియాను గెలిపించింది. అరంగేట్రంలోనే ఈ అద్భుత ఇన్నింగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది.

ఫాదర్ కార్పెంటర్.. అబ్బాయిలతో గల్లీ క్రికెట్.. కట్ చేస్తే.. అరంగేట్రంలో టీమిండియా ప్లేయర్ తుఫాన్ ఇన్నింగ్స్‌..
Amanjot Kaur Indw Vs Saw
Venkata Chari
|

Updated on: Jan 20, 2023 | 1:30 PM

Share

Amanjot Kaur: టీ20 ప్రపంచకప్‌నకు ముందు దక్షిణాఫ్రికాలో ముక్కోణపు సిరీస్‌లో ఆడుతున్న టీమిండియా.. తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయాన్ని అందుకుంది. ఈస్ట్ లండన్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా 27 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. 30 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసిన ఆల్ రౌండర్ అమన్‌జోత్ కౌర్ టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లోనే అమన్‌జోత్ అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. తొలి మ్యాచ్‌లోనే అద్భుతం చేసి, ఆకట్టుకుంది. అయితే, అమంజోత్ కౌర్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విధానం కూడా ఎంతో స్ఫూర్తిగా నిలిచింది. టీమిండియాలోకి రాకముందు ఎన్నో కష్టాలు పడిన అమన్‌జోత్.. ఎట్టకేలకు ఎంట్రీ ఇచ్చి, తొలి మ్యాచ్‌లోనే ఆకట్టుకుంది.

అమన్‌జోత్ 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగింది. ఆ సమయంలో టీమిండియా 11.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 69 పరుగులు మాత్రమే చేసింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి దిగిన అమంజోత్, దీప్తి శర్మతో కలిసి తుఫాను ఇన్నింగ్స్ ఆడి, 76 పరుగులు జోడించి జట్టును 147 పరుగులకు చేర్చింది. దీంతో దక్షిణాఫ్రికా ప్రెజర్‌లోకి వెళ్లింది. ఆతిథ్య జట్టు 20 ఓవర్లలో 120 పరుగులు మాత్రమే చేయగలిగింది.

అమంజోత్ తండ్రి కార్పెంటర్..

అమంజోత్ కౌర్ 15 సంవత్సరాల వయస్సులో మొదటిసారిగా క్రికెట్ అకాడమీలోకి ప్రవేశించింది. కేవలం 23 సంవత్సరాల వయస్సులో, ఈ క్రీడాకారిణి టీమ్ ఇండియాకు అరంగేట్రం చేసింది. సహజంగానే ఈ అమ్మాయి చాలా ప్రతిభావంతురాలు. అందుకే ఆమె ఎంట్రీ సూపర్‌ఫాస్ట్ శైలిలో జరిగింది. అమన్‌జోత్ మొదటి మ్యాచ్‌లోనే తనను తాను నిరూపించుకుంది.

ఇవి కూడా చదవండి

తండ్రి త్యాగంతో..

అమంజోత్ కథ పూర్తిగా చిత్రమైనది. ఈ క్రీడాకారిణి తన వీధిలోని అబ్బాయిలతో క్రికెట్ ఆడేది. స్కూల్‌లో కూడా అమంజోత్ అబ్బాయిలతో క్రికెట్ ఆడేది. అమన్‌జోత్ తండ్రి భూపీందర్ సింగ్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అయినప్పటికీ, అతను తన కుమార్తె ఇష్టా్న్ని తన అభిరుచిగా భావించాడు. భూపీందర్ సింగ్ తన కుమార్తెను క్రికెట్ అకాడమీలో చేర్పించాడు. ఆమె కెరీర్ కోసం ఏకంగా నగరాన్నే మార్చాడు. చివరకు చండీగఢ్‌లో అమన్‌జోత్‌కు సరైన శిక్షణ లభించింది. కూతురి కోసం తన పనిని తగ్గించుకుని, ఆమెను అకాడమీలో డ్రాప్ చేసి పికప్ చేసుకునేవాడు. ఆ తండ్రి త్యాగానికి తగిన ఫలితం.. ఎట్టకేలకు తొలి మ్యాచ్‌లోనే అమన్‌జోత్ అందించింది. తన కుమార్తె అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించగానే.. అమన్ తండ్రి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ప్రస్తుతం పుత్రికాత్సోహంతో ఉన్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..