India vs Pakistan: అమెరికాలో భారత్-పాకిస్తాన్ పోరు.. ఐసీసీ స్పెషల్ ప్లాన్.. మ్యాచ్ ఎప్పుడంటే?
ICC T20 World Cup: గతేడాది ఆగస్టులో భారత్ వెస్టిండీస్, అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీమిండియా 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడింది.
T20 World Cup 2024: ఐసీసీ తన ప్రతి టోర్నమెంట్‌లో కనీసం ఒక భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను నిర్వహించేలా చూస్తోంది. ఈ ఇద్దరు చిరకాల ప్రత్యర్థులు 2024 టీ20 ప్రపంచకప్‌లో కూడా తలపడేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ ప్రపంచకప్‌కు వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అమెరికాలో జరుగుతుందని, వెస్టిండీస్‌లో కాదని అమెరికా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అతుల్ రాయ్ ప్రకటించారు.
ఫ్లోరిడాలో జరిగిన భారత్-వెస్టిండీస్ మ్యాచ్‌కు స్థానిక అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన లభించిందని రాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌కి సంబంధించిన టిక్కెట్‌లన్నీ అమ్ముడుపోయాయి. అందుకే భారత్-పాకిస్థాన్ ప్రపంచకప్ మ్యాచ్ కూడా ఇక్కడే నిర్వహిస్తే అభిమానుల నుంచి విపరీతమైన మద్దతు లభిస్తుందని భావిస్తున్నాం.
గతేడాది ఆగస్టులో భారత్ వెస్టిండీస్, అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో టీమిండియా 5 టీ20లు, మూడు వన్డేల సిరీస్‌లు ఆడింది. ఫ్లోరిడా వేదికగా జరిగిన చివరి టీ20లో భారత్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో టీ20 సిరీస్‌ను 4-1తో టీమిండియా కైవసం చేసుకుంది.
అమెరికాలోనే భారత్-పాక్ మ్యాచ్ ఎందుకు?
ఐసీసీ టోర్నమెంట్ కమిటీ అమెరికాలోని వివిధ నగరాలను రెండుసార్లు సందర్శించింది. 2024 టీ20 ప్రపంచ కప్‌లో ఈ మ్యాచ్ ఆతిథ్యం అమెరికాకు ఇచ్చారు. ఎందుకంటే భారత్ వర్సెస్ పాకిస్తాన్ దేశాలకు చెందిన జనాభా అక్కడ ఎక్కువగా ఉండమేనని తెలుస్తోంది.
దీని వెనుక మరో కారణం ఏమిటంటే.. అమెరికాలోనూ క్రికెట్‌కు ప్రాచుర్యం కల్పించాలని ఐసీసీ ప్రయత్నిస్తోంది. ఇప్పుడు బేస్‌బాల్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ వంటి ప్రసిద్ధ క్రీడలు అక్కడ ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న ప్రముఖ క్రీడలుగా ఉన్నాయి.
ప్రతి ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఎందుకు జరుగుతుంది? గత పదేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేవు. ఐసీసీ దీనిని సద్వినియోగం చేసుకుంటుంది. ప్రతి టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్‌ను ఏర్పాటు చేస్తుంది. సాధారణంగా ఈ మ్యాచ్ టోర్నీ తొలిదశలో జరుగుతుంది. ఇది టోర్నీకి హైప్ ఇస్తుంది. అటువంటి పరిస్థితిలో ఐసీసీ, ఆతిథ్య దేశం టిక్కెట్లు, స్పాన్సర్లు మొదలైన వాటి నుంచి భారీగా డబ్బు సంపాదిస్తుంది. మొత్తం ప్రపంచ కప్ వీక్షకుల సంఖ్య మూడింట ఒక వంతు ఈ మ్యాచ్ నుంచే రావడం గమనార్హం.
అంతకుముందు వన్డే ప్రపంచకప్‌లో పోటీ..
తదుపరి టీ20 ప్రపంచకప్ 2024లో జరగనుంది. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇందులో కూడా భారత్-పాకిస్థాన్ మధ్య పోటీ తప్పదని భావిస్తున్నారు. అయితే ఈ సమయంలో ఆసియా కప్‌నకు సంబంధించి ఇరు దేశాల బోర్డుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఆసియా కప్ ఆడేందుకు భారత జట్టు పాకిస్థాన్ వెళ్లబోదని భారత క్రికెట్ బోర్డు కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ చీఫ్ జైషా తెలిపారు. అందుకే ఆసియా కప్‌ను పాకిస్థాన్ నుంచి తరలించనున్నారు. దీన్ని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వ్యతిరేకిస్తోంది. భారత జట్టు పాకిస్థాన్‌కు రాకపోతే, పాకిస్థాన్ జట్టు కూడా ప్రపంచకప్ ఆడేందుకు భారత్‌కు వెళ్లదని పీసీబీ మాజీ చైర్మన్ రమీజ్ రాజా ప్రకటించారు.
దీంతో రమీజ్ రాజా చైర్మన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు పీసీబీ చైర్మన్‌గా నజం సేథీ నియమితులయ్యారు. ప్రపంచకప్ కోసం భారత్‌కు జట్టును పంపాలా వద్దా అనేది పాకిస్థాన్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు. ప్రభుత్వ నిర్ణయానికి బోర్డు నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని చెప్పుకొచ్చాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..