Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Politics: చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారా? ఇంతకీ రాహుల్‌కి మెగాస్టార్ రాసిన ఆ లేఖలో ఏముంది..?

Andhra Pradesh: రాహుల్ గాంధీకి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు లేఖ రాశారు.. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

AP Politics: చిరంజీవి కాంగ్రెస్‌లోనే ఉన్నారా? ఇంతకీ రాహుల్‌కి మెగాస్టార్ రాసిన ఆ లేఖలో ఏముంది..?
Chiranjeevi, Rahul Gandhi (File Photos)Image Credit source: TV9 Telugu
Follow us
TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 20, 2023 | 1:30 PM

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారా? కాంగ్రెస్ అధిష్టానానికి ఇంకా టచ్ లోనే ఉన్నారా? ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు మాటల వెనుక ఉద్దేశమేంటి? తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని మెగాస్టార్ అంటుంటే.. కాదు ఆయన ఇంకా మా పార్టీలనే ఉన్నారని ఈయన ఎందుకు చెబుతున్నారు. అంతేగాదు రాహుల్ గాంధీకి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు లేఖ రాశారు.. ఇంతకీ ఆ లేఖలో ఏముంది? ఏపీ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఆయన అలా.. ఈయన ఇలా..

‘నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను..నాకు ఏపీ పాలిటిక్స్ కు అస్సలు సంబంధం లేదు..నేను పక్క రాష్ట్రంలో ఉంటున్నాను’ –  చిరంజీవి

‘ఇప్పటికీ చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు..అయన రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశారు’ – ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు

ఇవి కూడా చదవండి

ఇవి రెండూ పరస్పర విరుద్ధమైన స్టేట్మెంట్లు.. చిరంజీవి నేను రాజకీయాలకు దూరం అంటారు.. కానీ ఏపీ పీసీసీ చీఫ్ మాత్రం ఇంకా చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటారు. ఈ లాజిక్ ఏంటో అర్థంగాక ఏపీ జనాలు జుట్టు పీక్కుంటున్నారు. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా…రాజకీయాలు నాకు దూరం కావడం లేదని రీసెంట్ గా గాడ్ ఫాదర్ సినిమాలో డైలాగ్ చెబుతారు చిరంజీవి. ఇప్పుడు అదే నిజమవుతోందా అనిపిస్తోంది గిడుగురుద్రరాజు కామెంట్స్ చూస్తే. అంతేగాదు తాను రీసెంట్ గా చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసినపుడు… ఆయన సోనియాంధీ నాయకత్వం పట్ల చాలా ప్రేమాభిమానాలు కలిగి ఉన్నారని చెప్పారు  గిడుగు రుద్రరాజు.. ఇటీవల చిరంజీవి రాహుల్ గాంధీకి లేఖ కూడా రాశారన్నారు…అందువల్ల ఆయన ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారని బావిస్తున్నానని చెప్పారు గిడుగు.

ఏపీ పాలిటిక్స్ కు నాకు ఎలాంటి సంబంధం లేదన్న చిరంజీవి..

ఒంగోలులో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన గిడుగురుద్రరాజు ఈ ప్రకటన చేశారు..అయితే ఇప్పటికిప్పుడు ఆయన ఈ ప్రకటన ఎందుకు చేసారనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. తాను రాజకీయాలకు దూరం అని ఏ పార్టీలోనూ తాను లేనని పదేపదే చిరంజీవి ప్రకటన చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం ఆయన్ని ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే గుర్తిస్తున్నారు. అంటే టెక్నికల్ గా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న చిరంజీవి…అందుకు రాజీనామా చేయకపోవడమే ఇందుకు కారణమంటున్నారు..ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరిగినపుడు కూడా చిరంజీవి పేరుతో ఐడీ కార్డ్ కూడా విడుదల చేశారు. సాంకేతికంగా చిరంజీవికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకున్నారు..అయితే గత కొన్నేళ్లుగా ఆయన ఎక్కడా కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు..2014ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏపీ ఎన్నికల్లోనూ…ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ ప్రచారం కూడా చేసారు.. కానీ అటు దేశంలో..ఇటు రెండు తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పరాభవం తర్వాత ఎక్కడా ఆయన కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా లేరు.. అంతేగాదు రీసెంట్ గా వైసీపీమంత్రి రోజా తన కుటుంబంపై చేసిన విమర్శల నేపథ్యంలో ఆయన రిప్లై కూడా ఇచ్చారు..తాను పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానని అందులోనూ తాను పక్క రాష్ట్రమైన తెలంగాణలో నివాసముంటున్నానని తనకు ఏపీ పాలిటిక్స్ కు ఏమాత్రం సంబంధం లేదని కూడా చెప్పారు.

Chiranjeevi

Megastar Chiranjeevi

ప్రజారాజ్యంతో పాలిటిక్స్ లోకి ఎంట్రీ

2009ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి.. ఆ ఎన్నికల్లో కేవలం 18 సీట్లకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంతేగాదు యూపీఏ2 ప్రభుత్వంలో కేంద్ర పర్యాటక శాఖమంత్రిగాను పని చేశారు. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీకి దూరమయ్యారు చిరంజీవి. అసలు నిజానికి రాజకీయాలకే ఆయన దూరంగా ఉన్నారు. మళ్లీ సినిమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు కూడా.. తన తమ్ముడు జనసేన పార్టీ పెట్టినప్పటికీ ఆ పార్టీ తరఫున 2019 ఎన్నికల్లో ప్రచారం కూడా చేయలేదు చిరంజీవి. కనీసం తమ్ముడి పార్టీకి అనుకూలంగా చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ పీసీసీ చీఫ్ గిడుగురుద్రరాజు చేసిన కామెంట్ ఆసక్తికరంగా మారాయి.

రాహుల్ గాంధీకి లేఖ ఎందుకు రాశారు.. అందులో ఏముంది?

ఇటీవల రాహుల్ గాంధీకి చిరంజీవి లేఖ కూడా రాశారని చెప్పడం ఇంకా ఆసక్తిగా మారింది. అసలు మెగాస్టార్ …రాహుల్ గాంధీకి లేఖ ఎందుకు రాశారు..ఏమని రాశారు? అనేది చర్చనీయాంశంగా మారింది. భారత్ జోడో యాత్రలో భాగంగా తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీని కూడా చిరంజీవి కలవలేదు. మరి లేఖ ఎందుకు రాశారనేదే ఇప్పుడు హాట్ టాపిక్. పాలిటిక్స్ కు దూరంగా ఉన్నానన్న చిరంజీవి రాహుల్ కు లేఖ రాయాల్సిన అవసరం ఏంటన్నది ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. భారత్ జోడో యాత్ర చేపడుతున్న రాహుల్‌కి అభినందనలు తెలియజేస్తూ మర్యాదపూర్వకంగానే చిరంజీవి ఆ లేఖ రాసి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రాహుల్‌కి రాసిన లేఖతో తన పొలిటికల్ రీ-ఎంట్రీకి చిరంజీవి హింట్ ఇచ్చారా? అన్న చర్చ కూడా జరుగుతోంది.  ఇంతకీ చిరంజీవి రాసిన ఆ లోఖలో ఏముందన్నది ప్రస్తుతానికి చిదంబర రహస్యమే..

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..