AP High Court: నిర్మాణాలు ఆపాలని చెప్పినా కొనసాగించడం ఏమిటి.. ప్రభుత్వం తీరుపై మండిపడిన హైకోర్టు..
పాఠశాలల ఆవరణలో గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. భవనాలను పాఠశాలలకే అప్పగిస్తామని ప్రభుత్వ...

పాఠశాలల ఆవరణలో గ్రామ వార్డు సచివాలయాల నిర్మాణంపై హైకోర్టులో విచారణ జరిగింది. సచివాలయాల నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. భవనాలను పాఠశాలలకే అప్పగిస్తామని ప్రభుత్వ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నిర్మాణాలు ఆపమని చెప్పినా కొనసాగించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల సొమ్ముతో నిర్మించినందుకే పాఠశాలలకు అప్పగిస్తున్నామని ప్రభుత్వం తరఫు న్యాయవాది అన్నారు. పాఠశాలల అవసరాలకే ఆ భవనాలను వినియోగించేలా చేస్తున్నామని వివరించారు. తదుపరి విచారణ ఈనెల 24కి వాయిదా వేసింది. స్కూలు ఆవరణల్లో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు నిర్మించవద్దని గతంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
గ్రామ సచివాలయాలు, వెల్ నెస్ సెంటర్లు, ఇతర భవనాలను నిర్మించేందుకు పాఠశాలలను ఎంచుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉన్న ప్రాంగణాల్లో ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించకూడదన్న నిబంధనలు ఉన్నాయి. హైకోర్టు గతంలోనూ ఇలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఆదేశించింది. ఆయినా నిర్మాణాలు కొనసాగాయి. పాఠశాల ప్రాంగణాల్లో ఉన్న భవనాలను సంబంధిత పాఠశాలకే అప్పగిస్తారు. ఆ భవనాలను విద్యాశాఖకు అప్పగించాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు ఇచ్చింది.
ఈ విషయంలో పలుమార్లు ఉన్నతాధికారులు హైకోర్టు ఎదుట హాజరయ్యారు. పదే పదే హైకోర్టు ఆదేశాలు ఇస్తున్నప్పటికీ ఉల్లంఘిస్తున్నందున వారిని హైకోర్టు మరోసారి పిలిపించింది. ఆ భవనాలన్నింటినీ విద్యాశాఖకు అప్పగించాలని ఆదేశించడంతో.. వాటిని అదనపు తరగతి గదులుగా వినియోగించుకునే అవకాశం ఉంది.




మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..