Kamareddy: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దుకు తీర్మానం, రైతులు ఆందోళన విరమించాలంటూ విజ్ఞప్తి..
రైతుల పోరాటం ఫలించింది. జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ రెండు చోట్లా తీర్మానాలు ప్రవేశపెట్టారు.
రైతుల పోరాటం ఫలించింది. జగిత్యాల, కామారెడ్డి మున్సిపల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ రెండు చోట్లా తీర్మానాలు ప్రవేశపెట్టారు. రైతుల ఆందోళనలతో అత్యవసరంగా సమావేశమైన మున్సిపల్ కౌన్సిల్స్..మాస్టర్ ప్లాన్ రద్దు తీర్మానాన్ని ఆమోదించాయి. వాటిని ప్రభుత్వానికి పంపించామని..రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నాయి పాలకవర్గాలు.
జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తున్నట్టు తెలిపారు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్. రైతులకు చెందిన ఇంచ్ భూమిని కూడా తీసుకోబోమన్నారు. డిజైన్ డెవలప్‌మెంట్ ఫోరం నుంచి వచ్చిన డ్రాఫ్ట్ ప్లాన్‌ను రద్దు చేయాలని తీర్మానించామన్నారు కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ జాహ్నవి. ఆ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపించినట్టు తెలిపారు.