మెగా ఫ్యామిలీపై కామెంట్స్‌.. ‘ఏది నన్ను భయపెట్టలేదే’ అంటూ మంత్రి రోజాకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన బ్రహ్మాజీ

నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్‌ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు' అని ట్విట్టర్‌లో మంత్రి రోజాను ప్రశ్నించారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

మెగా ఫ్యామిలీపై కామెంట్స్‌.. 'ఏది నన్ను భయపెట్టలేదే' అంటూ మంత్రి రోజాకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చిన బ్రహ్మాజీ
Minister Roja, Brahmaji
Follow us
Basha Shek

|

Updated on: Jan 20, 2023 | 6:10 AM

మెగా ఫ్యామిలీని ఉద్దేశిస్తూ ఏపీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలకు అదిరిపోయే పంచ్‌ ఇచ్చారు ప్రముఖ నటుడు బ్రహ్మాజీ. మెగా కుటుంబంలో ఆరేడు మంది హీరోలు ఉన్నారని, అందుకే చిన్న ఆర్టిస్ట్‌లు భయపడి వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటూ రోజా చేసిన కామెంట్లపై సోషల్‌ మీడియా వేదికగా కౌంటర్‌ ఇచ్చారాయన. ‘నన్ను ఎప్పుడూ మెగా ఫ్యామిలీ క్యాంపెయిన్‌ చెయ్యమని కానీ, పార్టీలో చేరమని కానీ అడగలేదు. చిన్న ఆర్టిస్ట్‌లే కదా.. అంత భయపడతారెందుకు’ అని ట్విట్టర్‌లో మంత్రి రోజాను ప్రశ్నించారు బ్రహ్మాజీ. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘మీ నుంచి ఈ రియాక్షన్‌ ఊహించలేదన్నా.. సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందించిన మొదటి వ్యక్తివి నువ్వు.. థ్యాంక్యూ’ అంటూ మెగాభిమానులు, జనసేన అభిమానులు బ్రహ్మాజీ ట్వీట్‌ను రీ ట్వీట్స్‌ చేస్తున్నారు. కాగా ఇటీవల పలు సందర్భాల్లో మెగా ఫ్యామిలీ గురించి రోజా చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్‌గా మారాయి.  చిరంజీవి ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడితే.. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అని భయంతోనే చిన్న ఆర్టిస్ట్‌లు వాళ్లకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రేమతో మాత్రం కాదు. నిజంగా ప్రేమ ఉంటే.. వాళ్లు ప్రకాశ్ రాజ్‌కు మా ఎన్నికలలో సపోర్ట్ చేసినప్పుడు.. ఆయన ప్రెసిడెంట్‌గా ఎందుకు గెలవలేదు. ఒక్కసారి ఆలోచించండి.. ప్రేమ వేరు.. భయం వేరు’ అని రోజా చెప్పుకొచ్చారు. ఇప్పుడీ వ్యాఖ్యలపైనే రియాక్టయ్యారు నటుడు బ్రహ్మాజీ.

కాగా ఇటీవల యువశక్తి సభలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మంత్రి రోజాపై విమర్శల వర్షం గుప్పించారు. ఇక ఇదే సభలో ప్రముఖ జబర్దస్త్‌ కమెడియన్‌ హైపర్‌ ఆది కూడా రోజాతో సహా వైసీపీ మంత్రులపై తనదైన శైలిలో పంచులు వేశారు. పవన్‌ కల్యాణ్‌ను తిట్టడం కోసం ఇక ప్రత్యేక శాఖను పెట్టుకోవాలంటూ మంత్రులకు చురకలంటించారు. దీనిపై కౌంటర్‌ అటాక్ కూడా మొదలైంది. రోజాతో పాటు వైసీపీ నాయకులు సోషల్‌ మీడియా వేదికగా ఆదిని ఏకిపారేస్తున్నారు. అంతకుముందు జబర్దస్త్ శీను కూడా డైరెక్టుగా మెగా ఫ్యామిలీపై రోజా వ్యాఖ్యలను తప్పుపట్టాడు. కేవలం రాజకీయ ప్రాపకం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ హితవు పలికారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..