AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు రీల్స్‌ చేయడం వచ్చా? ఆ సినిమా టికెట్‌తో పాటు పుష్ప 2 షూటింగ్‌ చూసే ఛాన్స్‌.. పూర్తి వివరాలివే

VVIT vs VBVK  అంటూ గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ప్లేయర్‌ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్‌ సైదులు చేతుల మీదుగా 'ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం' సాంగ్ రిలీజ్ చేయించింది. కాగా ఈ కార్యక్రమంలోనే ఒక బంపరాఫర్‌ ఇచ్చారు ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు.

మీకు రీల్స్‌ చేయడం వచ్చా? ఆ సినిమా టికెట్‌తో పాటు పుష్ప 2 షూటింగ్‌ చూసే ఛాన్స్‌.. పూర్తి వివరాలివే
Producer Bunny Vasu
Basha Shek
|

Updated on: Jan 20, 2023 | 6:10 AM

Share

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ముర‌ళి కిషోర్ అబ్బురు దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో క‌శ్మీర ప‌ర్ధేశీ హీరోయిన్‌గా కనిపించనుంది. మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ స‌మ‌ర్పణలో జీఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఈ సినిమా నుంచి వచ్చిన ‘వాసవసుహాస’ పాట, మూవీ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 2023 ఫిబ్రవరి 17న విడుదల కానుంది. కాగా ఈ సినిమా ప్రమోషన్లలో చిత్రబృందం బిజీగా ఉంటోంది. సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే VVIT vs VBVK  అంటూ గుంటూరు కాలేజ్ క్రికెట్ టీమ్‌తో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్‌లో ప్లేయర్‌ అఫ్ ది మ్యాచ్ ప్లేయర్‌ సైదులు చేతుల మీదుగా ‘ఓ బంగారం నీ చెయ్యి తాకగానే ఉప్పొంగిపోయిందే నా ప్రాణం’ సాంగ్ రిలీజ్ చేయించింది. కాగా ఈ కార్యక్రమంలోనే ఒక బంపరాఫర్‌ ఇచ్చారు ప్రొడ్యూసర్‌ బన్నీ వాసు.

‘ఓ బంగారం సాంగ్‌ను రీల్‌ చేసి గీతా ఆర్ట్స్‌ను ట్యాగ్‌ చేయండి. సెలెక్ట్ అయిన 10 మందికి, వాళ్ల కుటుంబ సభ్యులకు ఈ సినిమాను ఫ్రీగా చూపిస్తాం. అంతేకాకుండా కాకుండా వాళ్లను పుష్ప షూటింగ్‌కు కూడా తీసుకెళ్తాం’ అని ప్రకటించారు బన్నీ వాసు. కాగా తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు చేతన్ భరద్వాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు. విశ్వాస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. స‌హ నిర్మాత‌గా బాబు, స‌త్యగమిడి, శ‌రత్ చంద్ర నాయుడు ఎక్స్ క్యూటివ్ నిర్మాత‌లుగా వ్యవహరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..