Viral Video: కారు బానెట్‌పై యువకుడిని ఈడ్చుకెళ్లిన మహిళ.. అందరూ కేకలు వేస్తున్నా ఆగని వైనం

'ప్రియాంక..  దర్శన్ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత దర్శన్ ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు.. ఇంతలో ప్రియాంక..  అసభ్యకరమైన గుర్తు చూపించి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో దర్శన్ ఆమెను కారు నుండి బయటకు రావాలని కోరాడు.

Viral Video: కారు బానెట్‌పై యువకుడిని ఈడ్చుకెళ్లిన మహిళ.. అందరూ కేకలు వేస్తున్నా ఆగని వైనం
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: Jan 20, 2023 | 6:36 PM

సోషల్ మీడియాలో  ఒక షాకింగ్ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఒక మహిళ తన కారు బానెట్‌పై ఉన్న యువకుడిని లెక్క చేయకుండా కారు నడుపుతున్నట్లు కనిపిస్తుంది. ఈ ఘటన బెంగుళూరులోని జనానా భారతి నగర్ ప్రాంతంలో చోటూ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. టాటా నెక్సాన్, మారుతీ స్విఫ్ట్ కార్లు ఒకదాని కొకటి ఢీకొన్నాయని పోలీసులు తెలిపారు. అయితే టాటా నేషన్‌ను ఒక మహిళ నడుపుతోంది. ఆ మహిళ పేరు ప్రియాంక అని పోలీసులు చెప్పారు. ఆ యువకుడిని దర్శన్ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండు వాహనాలు ఢీకొన్న తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

తర్వత ప్రియాంక కారును దర్శన్ ఆపాలనుకున్నాడు.. అయితే ప్రియాంక వెళ్లిపోవడనికి రెడీ అవుతూ.. తన కారు స్టార్ట్ చేసింది. కారు కదలకుండా ఆపేందుకు దర్శన్ బానెట్ పైకి దూకాడు. అయినప్పటికీ ప్రియాంక తన కారును ముందుకు పోనిచ్చింది. దర్శన్‌ కారు  బోనెట్‌కు వేలాడుతునే ఉన్నాడు.. అలా ప్రియాంక కిలోమీటరు దూరం ప్రయాణించింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో, వాహనం వెనుక కొంతమంది బైక్స్ పై వెళ్తున్న వ్యక్తులు కూడా కనిపించారు.

ఇవి కూడా చదవండి

 వైరల్ వీడియో 

ట్రాఫిక్ వెస్ట్ డిప్యూటీ పోలీస్ కమిషనర్.. మాట్లాడుతూ.. ‘ప్రియాంక..  దర్శన్ కారును ఢీకొట్టింది. ఆ తర్వాత దర్శన్ ఆమెను ఆపడానికి ప్రయత్నించాడు.. ఇంతలో ప్రియాంక..  అసభ్యకరమైన గుర్తు చూపించి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. దీంతో దర్శన్ ఆమెను కారు నుండి బయటకు రావాలని కోరాడు. ఆమె దర్శన్ ను అభ్యర్ధనని తిరస్కరించింది. తాను కారులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించింది. డ్రైవింగ్ కొనసాగించింది. తనను తాను రక్షించుకోవడానికి, దర్శన్ ఆమె కారు బోనెట్‌పైకి దూకాడు. అయినప్పటికీ  ప్రియాంక కారుని ఆపలేదు.. అలా దాదాపు ఒక కిలోమీటరు వరకూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళింది.

‘ప్రియాంక కారును ఆపినప్పుడు.. దర్శన్ .. అతని స్నేహితులు ఆమె కారులోని కొన్ని భాగాలను పగులగొట్టారు. ఇరువర్గాలు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రియాంకపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేయగా, దర్శన్ .. అతని స్నేహితులపై సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..