Trending Video: బ్యాండ్‌ బాజాలతో ఘనంగా వివాహం….డిజే మోతలతో బరాత్‌..ఎవరికో తెలుసా!

ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో జనాలు...

Trending Video: బ్యాండ్‌ బాజాలతో ఘనంగా వివాహం....డిజే మోతలతో బరాత్‌..ఎవరికో తెలుసా!
Dogs Marriage Video
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 20, 2023 | 6:20 PM

ప్రస్తుత సమాజంలో ఇంటర్నెట్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది. చిన్నా పెద్దా ఆడా మగా అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు. ఇంటర్నెట్‌ అందరికీ అందుబాటులోకి రావడంతో జనాలు రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పాపులర్‌ అవ్వాలని ప్రయత్నిస్తున్నారు. డాన్సులు, స్టంట్స్‌, సాహసాలు, సరసాలు..అబ్బో.. నెట్టింట చేరేందుకు కాదేదీ అనర్హం అన్నట్లు చేస్తున్నారు. వీటిలో వివాహ వేడుకలు ప్రత్యేకమని చెప్పుకోవాలి. పెళ్లిళ్లలో సరదా సన్నివేశాలకు కొదవే ఉండదు. పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంటాయి. అయితే కొందరు ఒకడుగు ముందుకేసి తమ పెంపుడు జంతువులకు పెళ్లిళ్లు చేసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వీడియోలో రెండు కుక్కలకు ఘనంగా పెళ్లి జరిపించారు వాటి యజమానులు. అంతేకాదు ఇరుగు పొరుగువాళ్లు, బంధువుల పెంపుడు కుక్కలను ఈ వివాహానికి ఆహ్వానించి మంచి విందుకూడా ఇచ్చారు.

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌ జిల్లాలో ఈ వింత సంఘటన జరిగింది. టామీ అనే వరుడి శునకానికి, జెల్లీ అనే శునక వధువునిచ్చి జనవరి 14న వైభవంగా వివాహం జరిపించారు. అంతేకాదు, అట్రౌలీలోని తిక్రి రాయ్‌పూర్‌ నుంచి వరుడి శునకాన్ని తీసుకొని కుటుంబమంతా ఊరేగింపుగా అలీగఢ్‌లోని వధువు శునకం గ్రామం సుఖ్రావలికి చేరుకున్నారు. బ్యాండ్‌ మేళాలు, డీజే మోతలతో డాన్సులు చేసుకుంటూ మరీ వధువు ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఘనంగా పెద్దలందరి సమక్షంలో వివాహం జరిపించారు. ఆ తర్వాత నెయ్యితో తయారు చేసిన వంటకాలను కొత్త దంపతులైన కుక్కల జంటకు వడ్డించారు. ఆ ప్రాంతంలోని పొరుగింటి కుక్కలకు కూడా విందు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత వీడ్కోలు కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ శునక వివాహానికి గాను దాదాపు 45 వేల రూపాయల వరకూ ఖర్చుచేసినట్లు టామీ యజమాని చెప్పాడు. ఇప్పుడు ఈ కుక్కల పెళ్లి వీడియో నెట్టింట చేరి తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ