Viral Video: నల్లటి చీకటి.. దట్టమైన అడవి.. ఒకవైపు సింహం.. మరోవైపు కొండచిలువ.. కట్ చేస్తే..
అడవిలో బ్రతుకు జట్కా బండి నడవాలంటే.. ప్రతీ క్షణం ప్రాణంతో చెలగాటం ఆడాల్సిందే. కడుపు నింపుకునేందుకు..
అడవిలో బ్రతుకు జట్కా బండి నడవాలంటే.. ప్రతీ క్షణం ప్రాణంతో చెలగాటం ఆడాల్సిందే. కడుపు నింపుకునేందుకు క్రూర జంతువులన్నీ కూడా మరో జంతువుపై ఆధారపడతాయి. ఇక సింహం, పులి, చిరుత వేట అత్యంత కిరాతకంగా ఉంటుంది.. అదే కొండచిలువ మట్టుపెడితే.. సీన్ కాస్తా రివర్సే.. పైన పేర్కొన్న జంతువులన్నీ కూడా దాదాపుగా పైథాన్‌కు దూరంగా ఉంటాయి. దాన్ని వేటాడటం చాలా తక్కువ.
సాధారణంగా మిగిలిన జంతువులు అడవిలో సింహాన్ని దూరం నుంచి చూస్తే చాలు.. క్షణాల్లో అక్కడ నుంచి పరుగులు పెడతాయి. అయితే అదే సింహానికి చుక్కలు చూపించడమే కాదు.. మాటు వేసి మట్టుపెట్టింది ఓ కొండచిలువ. నల్లటి చీకటి.. దట్టమైన అడవి మధ్యలో జరిగిన ఈ ఊహించని పరిణామం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో ప్రకారం.. రాత్రివేళ ఆహారం కోసం సింహం ఓ మ్యాన్ హోల్ లాంటి ప్రదేశంలో వెతుకుతున్నట్లు మీరు చూడవచ్చు. అందులో ఏముందా అని తొంగి మరీ చూస్తుంది ఈ క్రూర జంతువు. అయితే దానికి అక్కడేం దొరకదు. మరి ఇక్కడే కథలో అసలు ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. అందులోనే నక్కిన ఓ భారీ కొండచిలువ.. ఒక్క ఉదుటన దానిపై దాడి చేస్తుంది. క్షణాల్లో సింహాన్ని చుట్టేస్తుంది.
పైథాన్ నుంచి విడిపించుకునేందుకు సింహం ఎంతగానో ప్రయత్నిస్తుంది. అయితే ఎక్కడా కూడా ప్రయోజనం లేకపోయింది. తన పదునైన దవడలతో సింహంపై ఎటాక్ చేయడమే కాదు.. అది చనిపోయేదాకా దాన్ని చుట్టేసి.. మొత్తానికి మట్టుబెడుతుంది కొండచిలువ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఆలస్యమెందుకు మీరూ వీడియోపై ఓ లుక్కేయండి.
Eunectes attacks a mountain lion pic.twitter.com/NRqjSxichA
— Turki (@511turkee) January 14, 2023