Love Today: లవ్ టుడే సినిమాలాగే ఫోన్లు మార్చుకున్న అమ్మాయి, అబ్బాయి.. కట్ చేస్తే బిగ్ షాక్..
ప్రస్తుత కాలంలో ఒక పూట అన్నం, నీళ్లు తీసుకోకుండా అయినా ఉండగలరు కానీ, సెల్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు జనాలు. అంతలా ఫోన్‌కు బానిసయ్యారు ప్రజలు.

ప్రస్తుత కాలంలో ఒక పూట అన్నం, నీళ్లు తీసుకోకుండా అయినా ఉండగలరు కానీ, సెల్ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేకపోతున్నారు జనాలు. అంతలా ఫోన్‌కు బానిసయ్యారు ప్రజలు. ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్లాలన్నా ప్రతి పనికి ఫోన్ తప్పనిసరి అయిపోయింది. దాంతో ఫోన్ లేకపోతే ఏ పని పూర్తవని పరిస్థితి నెలకొంది. అయితే.. ఫోన్ వినియోగం వల్ల మంచి ఎంత ఉందో.. అంతకు మించి చెడు కూడా ఉంది. ప్రజలు మంచి కంటే చెడునే ఎక్కువగా గ్రహిస్తున్నారు. అందుకే.. ఫోన్ల కారణంగానే మనుషుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ముఖ్యంగా పెళ్లైన జంటలు, ప్రేమికుల మధ్య ఫోన్లు చిచ్చు పెడుతున్నారు. జంటలు విడిపోయేలా చేస్తున్నాయి. తాజాగా ఫోన్ కారణంగా కొద్ది రోజుల్లో పెళ్లి కావాల్సిన జంట విడిపోయింది. జస్ట్ ఫోన్లు మార్చుకోవడంతో వల్ల ఆ జంట.. బంధానికి బీటలువారింది. తమిళనాడులో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఫోన్ వినియోగం, దాని వల్ల బంధాలు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయనే నేపథ్యంలో ఇటీవల ‘లవ్‌టుడే’ సినిమా విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాలో లవర్స్ ఇద్దరూ తమ తమ ఫోన్లను మార్చుకుంటారు. అలా మార్చుకోవడంతో మొదలవుతుంది అసలు కథ. అచ్చం అలాగే నిజజీవితంలోనూ చేసిందో జంట. అయితే, సినిమాలో నడిచింది కానీ, నిజ జీవితంలో సీన్ బిస్కెట్ అయ్యింది. తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన ఓ యువకుడికి, యువతికి పెళ్లి నిశ్చయం అయ్యింది.
అయితే, పెళ్లికి ముందే ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి లవ్‌టుడే సినిమా మాదిరిగా ఫోన్లను మార్చుకున్నారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, ఆ తరువాతే అసలు క్లైమాక్స్ మొదలైంది. అబ్బాయి ఫోన్‌ను అమ్మాయి క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ క్రమంలో అతని బ్రౌజింగ్ హిస్టరీని కూడా చెక్ చేసింది. అప్పుడే ఆమెకు మైండ్ బ్లాంక్ వీడియో కంట పడింది. అందులో ఓ అమ్మాయి న్యూడ్ వీడియో కనిపించింది. ఇంకేముంది.. కోపం నషాలానికి అంటింది. విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పిన యువతి.. చల్ హట్ అంటూ అబ్బాయితో పెళ్లిని క్యాన్సిల్ చేసింది. దాంతో పెళ్లి కథకు ఆదిలోనే ఎండ్ కార్డ్ పడింది.




మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
