AP Police Exam: ఏపీ పోలీస్‌ అభ్యర్థులకు అలెర్ట్‌.. రేపే ఎగ్జామ్.. ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోండి.. లేకపోతే..

AP Police Constable Prelims Exam: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కావాలనే నిరుద్యోగుల కలలు త్వరలోనే నిజం కానున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా..

AP Police Exam: ఏపీ పోలీస్‌ అభ్యర్థులకు అలెర్ట్‌.. రేపే ఎగ్జామ్.. ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోండి.. లేకపోతే..
AP Police Exam
Follow us

|

Updated on: Jan 21, 2023 | 3:22 PM

AP Police Constable Prelims Exam: ఆంధ్రప్రదేశ్‌లో పోలీస్ కావాలనే నిరుద్యోగుల కలలు త్వరలోనే నిజం కానున్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ పరీక్షకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమనరీ రాత పరీక్ష నిర్వహించేందుకు పకడ్భందీ ఏర్పాట్లు చేశారు. ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టర్లు పరీక్షల నిర్వహణ కేంద్రాలను ఇప్పటికే సందర్శించారు.. భద్రతా ఏర్పాట్లలో భాగంగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుంది. అయితే, అభ్యర్థులను ఉదయం తొమ్మిది గంటల నుంచే పరీక్ష సెంటర్‌లోకి అనుమతివ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల తర్వాత ఒక్కనిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.

పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమనరీ ఎగ్జామ్ రాసే అభ్యర్థులు పరీక్ష హాల్ లోకి మొబైల్ ఫోన్, ట్యాబ్, లాప్టాప్, పెన్ డ్రైవ్, బ్లూటూత్ పరికరాలు, స్మార్ట్ వాచ్, కాలిక్యులేటర్, పర్స్, నోట్స్, చార్ట్‌లు, పేపర్లు, రికార్డింగ్ పరికరాలు సహా ఇతర ఏ ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని అధికారులు తెలిపారు. కాగా, మొత్తం 6,100 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయితే, 5,03,486 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్‌ ప్రిలిమనరీ పరీక్ష నేపథ్యంలో అధికారులు పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణ కేంద్రాలను సందర్శించిన అన్ని జిల్లాల కలెక్టర్ లు నిఘా కోసం సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.