LIC ADO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 9,394 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 21, 2023 | 8:17 PM

భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా పలు జోన్లలో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 9,394 అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి..

LIC ADO Recruitment 2023: డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీలో 9,394 ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని పోస్టులున్నాయంటే..
LIC ADO Recruitment 2023

భారత ప్రభుత్వ ఆర్ధిక మంత్రిత్వ శాఖకు చెందిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్ఐసీ) దేశవ్యాప్తంగా పలు జోన్లలో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 9,394 అప్రెంటిస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిల్లో హైదరాబాద్‌లో 1408 ఏడీఓ పోస్టులు ఉన్నాయి.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఇండస్ట్రీ లేదా ఫైనాన్స్‌ ప్రొడక్ట్స్‌ మార్కెటింగ్‌ విభాగంలో కనీసం రెండేళ్ల పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. అభ్యర్ధుల వయసు జనవరి 1, 2023 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్‌ వర్గాలకు సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 10, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రోజు నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి రూ.750, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (ప్రిలిమినరీ/మెయిన్స్)/ఇంటర్వ్యూ/ప్రీ-రిక్రూట్‌మెంట్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ రాత పరీక్ష మార్చి 12న నిర్వహిస్తారు. మెయిన్స్‌ ఏప్రిల్‌ 8న ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.51,500ల నుంచి రూ.90,205ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు..

  • సెంట్రల్ జోనల్ ఆఫీస్ (భోపాల్) పోస్టులు: 561
  • ఈస్టర్న్ జోనల్ ఆఫీస్ (కోల్‌కతా) పోస్టులు: 1049
  • ఈస్ట్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (పట్నా) పోస్టులు: 669
  • నార్తర్న్ జోనల్ ఆఫీస్ (న్యూదిల్లీ) పోస్టులు: 1216
  • నార్త్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (కాన్పూర్) పోస్టులు: 1033
  • సదరన్ జోనల్ ఆఫీస్ (చెన్నై) పోస్టులు: 1516
  • సౌత్ సెంట్రల్ జోనల్ ఆఫీస్ (హైదరాబాద్) పోస్టులు: 1408
  • వెస్టర్న్ జోనల్ ఆఫీస్ (ముంబయి) పోస్టులు: 1942

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu