JEE Main Admit card 2023: జేఈఈ మెయిన్-2023 అడ్మిట్ కార్డులు విడుదల.. జనవరి 24 నుంచి పరీక్షలు..
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2023 రాత పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు ఈ రోజు (జనవరి 21) విడుదలయ్యాయి..
దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2023 రాత పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు ఈ రోజు (జనవరి 21) విడుదలయ్యాయి. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జనవరి 24న నిర్వహించనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైటులో ఉంచింది. జనవరి 25వ తేదీన జరగనున్న పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను జనవరి 22న వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా మిగిలిన తేదీల్లో పరీక్షల అడ్మిట్‌కార్డులను వరుసగా విడుదల చేయనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. దీంతో జనవరి 24 నుంచి దేశ వ్యాప్తంగా 290 నగరాల్లో, దేశం వెలుపలి 25 నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు ఎన్‌టీఏ స్పష్టంచేసింది.
కాగా జేఈఈ మెయిన్ పరీక్షల షెడ్యూల్‌లో కొన్ని మార్పులు చేసి కొత్త షెడ్యూల్‌ను తాజాగా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజా షెడ్యూల్ ప్రకారం.. బీఈ, బీటెక్ విభాగాల్లో జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్ష పేపర్ 1, రెండు షిఫ్టుల్లో జరగనుంది. ఇవి జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1 తేదీల్లో జరుగుతాయి. బీఆర్క్, బీప్లానింగ్ విభాగంలో పేపర్-2ఏ, 2బీ పరీక్ష మధ్యాహ్నం షిఫ్ట్‌లో జనవరి 28న జరుగనుంది. మెయిన్‌లో అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్ నిర్వహిస్తారు. జేఈఈలో సాధించిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.