Pet Dog: పెట్‌డాగ్‌ను ‘కుక్క’ అన్నాడని వృద్ధుడిపై పిడిగుద్దులు..! దెబ్బకు పరారైన కుటుంబం..

పొరుగింటి పెంపుడు శునకాన్ని 'కుక్క' అని సంభోదించినందుకు ఓ వృద్ధుడిని కిరాతకంగా హతమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో గురువారం (జనవరి 19)న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Pet Dog: పెట్‌డాగ్‌ను 'కుక్క' అన్నాడని వృద్ధుడిపై పిడిగుద్దులు..! దెబ్బకు పరారైన కుటుంబం..
Pet Dog
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 21, 2023 | 6:15 PM

పొరుగింటి పెంపుడు శునకాన్ని ‘కుక్క’ అని సంభోదించినందుకు ఓ వృద్ధుడిని కిరాతకంగా హతమర్చారు. ఈ సంఘటన తమిళనాడులో గురువారం (జనవరి 19)న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు, దిండిగల్ జిల్లాలో తాడికొంబు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉలగంపట్టియార్‌కోట్టమ్‌కు చెందిన రాయప్పన్‌ (62) తన పొరుగింటి వాళ్లు పెంచుకుంటున్న పెట్ డాగ్‌ని దానికి పెట్టిన పేరుతోకాకుండా ‘కుక్క’ అని సంభోదించేవాడు. శునకం యజమానులైన నిర్మలా ఫాతిమారాణి, ఆమె కుమారులు డానియెల్‌, విన్సెంట్‌ అలా పిలవవద్దని పలుమార్లు హెచ్చరించారు. ఐతే రాయప్పన్‌ మాత్రం కుక్కను బెల్ట్‌తో కట్టి ఉంచమని శునకం యజమానులకు తరచూ చెబుతుండేవాడు. వారు ఎప్పటిమాదిరిగానే శునకాన్ని బంధించకుండా వదిలేస్తుండేవారు.

ఈక్రమంలో సంఘటన జరిగిన రోజున కూడా సమీపంలోని తమ పొలంలోని బోరు స్విచ్ ఆఫ్ చేయమని రాయప్పన్ తన మనవడు కెల్విన్‌కు చెప్పారు. పొరుగింటి వారి కుక్క బయట ఉందేమో జాగ్రత్త కర్ర తీసుకుని వెళ్లు అని మనవడిని హెచ్చరించాడు. అలాగే తాత అంటూ మనవడు ముందుకు కదిలాడు. ఐతే అది విన్న పొరుగింటి వ్యక్తి డానియల్ కోపంతో రాయప్పన్ దగ్గరకు వచ్చి ఛాతీపై కొట్టాడు. ఎన్నిసార్లు చెప్పాలి కుక్క అని పిలవొద్దని అంటూ అదే పనిగా అతడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దాంతో రాయప్పన్ కుప్పకూలి పోయి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో డేనియల్ కుటుంబం అక్కడి నుంచి పారారైంది. సమాచారం అందుకున్న పోలీసులు డేనియల్ కుటుంబాన్ని గాలించి శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.