AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Economy: భవిష్యత్తు అంతా భారత్‌దే.. WEF సమ్మిట్‌లో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఆర్థికవేత్త మార్టిన్ వోల్ఫ్‌..

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మాంద్యం గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే, మాంద్యం సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా కొనసాగుతుండటం పట్ల పలువురు ఆర్థిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.

Indian Economy: భవిష్యత్తు అంతా భారత్‌దే.. WEF సమ్మిట్‌లో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌తో ఆర్థికవేత్త మార్టిన్ వోల్ఫ్‌..
Ashwini Vaishnaw Martin Wolf
Shaik Madar Saheb
|

Updated on: Jan 21, 2023 | 5:39 PM

Share

ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక మాంద్యం గురించి ఆందోళన చెందుతున్నాయి. అయితే, మాంద్యం సమయంలో కూడా భారత ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగా కొనసాగుతుండటం పట్ల పలువురు ఆర్థిక వేత్తలు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. భారత ఆర్థిక వ్యవస్థను తాజాగా ఫైనాన్షియల్ టైమ్స్ ప్రధాన ఆర్థికవేత్త, వ్యాఖ్యాత మార్టిన్ వోల్ఫ్ ప్రశంసించారు. వచ్చే 10-20 ఏళ్లలో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించడం ఖాయమంటూ ఆశాభావం వ్యక్తంచేశారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ 2023 సర్వసభ్య సమావేశంలో మార్టిన్ వోల్ఫ్ ప్రశంసలు కురిపించారు. కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మార్టిన్ వోల్ఫ్ మధ్య జరిగిన సమావేశంలో మార్టిన్ వోల్ఫ్ పలు విషయాలపై మాట్లాడారు. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఎదుగుదల చాలా బాగుందంటూ మార్టిన్ వోల్ఫ్ కొనియాడారు. రానున్న కాలంలో ప్రపంచ దేశాలు ఎలాంటి ఆర్థిక వ్యవస్థను ఆశిస్తున్నాయన్నది చాలా ముఖ్యమన్నారు. భారతదేశం గురించి మాట్లాడితే.. రాబోయే కాలం చాలా మంచిగా ఉందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో భారతదేశ ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దదిగా.. బలమైన వ్యవస్థగా మారుతుందని అభిప్రాయపడ్డారు.

1970ల నుంచి భారతదేశాన్ని చూస్తున్నామని.. వచ్చే కాలంలో భారతదేశం పెద్ద ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందడం ఖాయంటూ వోల్ఫ్ వివరించారు. భారతదేశం గురించి సీరియస్‌గా ఆలోచించని వారు.. ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నాము అనే విషయాన్ని కూడా ఆలోచించాలంటూ వోల్ఫ్ వివరించారు. దీనికి భారత్ డిజిటల్ చెల్లింపుల వృద్ధే నిదర్శమని వివరించారు.

మోడీ విధానాలతోనే భారత్ ముందంజలో..

డిజిటలైజేషన్ లో భారత్ ముందంజలో ఉందని.. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ అంతకుముందు తెలిపారు.  ప్రపంచం కష్టాల్లో ఉన్న సమయంలో కూడా ప్రధాని మోదీ ఆర్థిక విధానం గురించి ప్రత్యేకమైన శ్రద్ధవహించారని.. దీంతో భారత్ ఆర్థిక వ్యవస్థ స్థిరమైన వృద్ధికి దారి తీసిందని ఈ సందర్భంగా కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. డిజిటల్ చెల్లిపులు, ఆర్థిక పరమైన విషయాలు, పెట్టుబడుల విషయంలో భారత్ ముందంజలో ఉందని తెలిపారు. ఈ మార్పులకు ప్రధాని మోడీ అనుసరిస్తున్న విధానాలేనంటూ వివరించారు.

ఇవి కూడా చదవండి

2022 డిసెంబర్ వరకు డిజిటల్ చెల్లింపుల లావాదేవీలు (వార్షిక ప్రాతిపదికన) 1.5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది యుఎస్, యుకె, జర్మనీ, ఫ్రాన్స్‌ లో జరిగిన డిజిటల్ లావాదేవీల కంటే నాలుగు రెట్లు అధికమని వైష్ణవ్ చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..