AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tea: నాడు తన కడుపు కాల్చుకుని బిడ్డల ఆకలి తీర్చింది.. కట్‌చేస్తే 50 ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతూ..

ఒకప్పుడు బిడ్డల కడుపు నింపడానికి కాసిన్ని టీనీళ్లు తాగి ఆకలిని చంపుకుంది. ఆ తర్వాత కూడా అదే అలవాటుగా మారింది. దీంతో గత 50 ఏళ్లుగా ఓ మహిళ కేవలం టీ మాత్రమే తాగుతూ జీవనం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే..

Tea: నాడు తన కడుపు కాల్చుకుని బిడ్డల ఆకలి తీర్చింది.. కట్‌చేస్తే 50 ఏళ్లుగా కేవలం టీ మాత్రమే తాగుతూ..
West Bengal News
Srilakshmi C
|

Updated on: Jan 21, 2023 | 5:33 PM

Share

ఒకప్పుడు బిడ్డల కడుపు నింపడానికి కాసిన్ని టీనీళ్లు తాగి ఆకలిని చంపుకుంది. ఆ తర్వాత కూడా అదే అలవాటుగా మారింది. దీంతో గత 50 ఏళ్లుగా ఓ మహిళ కేవలం టీ మాత్రమే తాగుతూ జీవనం సాగిస్తోంది. వివరాల్లోకెళ్తే..

పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా, సియామ్ బజార్ పంచాయతీ పరిధిలోని బెల్డియా గ్రామానికి చెందిన అనిమా చక్రవర్తి (76) అనే వృద్ధురాలికి కొడుకు, మనుమలు ఉన్నారు. చిన్నవయసులో కుటుంబ ఆర్థిక పరిస్థితుల రిత్యా ఇళ్లలో పాచిపనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేది. ఆ సమయంలో పని ప్రదేశంలో మిగిలిపోయిన ఆహారాన్ని తన పిల్లల కోసం తీసుకొచ్చి వాళ్ల కడుపు నింపేది. ఆ తర్వాత తనకు తినడానికి ఏమీ మిగలేది కాదు. దీంతో తన ఆకలిని తీర్చుకోవడానికి టీ లేదా ఇతర పానీయాలతో కడుపు నింపుకునేది. ఆ తర్వాత ఇళ్లలో పని మానేసినా ఆమె ఆహార అలవాట్లు మాత్రం మారలేదు. దాదాపు యాభై ఏళ్లుగా ఆహారం తీసుకోకుండా కేవలం టీ మాత్రమే సేవిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ విషయం తన గ్రామంలోని ఇతరులకు ఎవ్వరికీ తెలియదు. తాజాగా ఈ విషయం బయటపడగానే అందరూ అమితాశ్చర్యాలకు గురయ్యారు. ప్రస్తుతం అనిమా ఆరోగ్యంగానే ఉంది.

వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఆరోగ్యంగా జీవించాలంటే ఘనాహారం మాత్రమే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లలోని రోగులకు ఏళ్లతరబడి ద్రవ రూపంలో మాత్రమే పోషకాలను అందిస్తారు. వారు ఆరోగ్యంగా కోలుకునేందుకు శరీరానికి కావల్సిన పోషకాలను లిక్విడ్ రూపంలో అందించడం జరుగుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.