Jammu Twin Blasts: జమ్ముకశ్మీర్‌లో జంట పేలుళ్లు.. ఏడుగురికి తీవ్రగాయాలు! రాహుల్ జోడో యాత్రకు హైఅలర్ట్..
జమ్ముకశ్మీర్ నర్వాల్‌లో శనివారం ఉదయం (జనవరి 21) జంట పేలుళ్లు సంభవించాయి. ట్రాన్స్‌పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడినట్లు అడిషనల్..
జమ్ముకశ్మీర్ నర్వాల్‌లో శనివారం ఉదయం (జనవరి 21) జంట పేలుళ్లు సంభవించాయి. ట్రాన్స్‌పోర్ట్ నగర్ యార్డ్ నంబర్ 7లో ఈ ఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు గాయపడినట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (జమ్మూ) ముఖేష్ సింగ్ వెల్లడించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దీన్ని ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుళ్లకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు పేలుడు సంభవించిన ప్రదేశంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుళ్ల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి జమ్మూకశ్మీర్‌లో జోడో యాత్ర ప్రారంభించారు. జనవరి 30న శ్రీనగర్‌లో యాత్ర ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ జోడో యాత్రపై అధికారులు అప్రమత్తమయ్యారు. రాహుల్ భద్రతకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ నుంచి 60 కి.మీల దూరంలో ఉన్న చడ్వాల్ వద్ద యాత్ర జరుగుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.