AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Wife and Husband: భర్తను పంచుకున్న ఇద్దరు భార్యలు.. ఆ రోజు మాత్రం అతడికి వీకాఫ్..

ఒక భార్యతో ఏగమే కష్టంరా దేవుడా అని చాలా మంది భావిస్తుంటారు. అలాంటిది ఇద్దరు భార్యలు ఉంటే.. ఇక సీన్ సితారే. అవును, ఇద్దరు భార్యలతో ఓ వ్యక్తి పడే ఇబ్బందులపై అనేక సినిమాలు,

Wife and Husband: భర్తను పంచుకున్న ఇద్దరు భార్యలు.. ఆ రోజు మాత్రం అతడికి వీకాఫ్..
Couple Representative Image
Shiva Prajapati
|

Updated on: Jan 21, 2023 | 3:07 PM

Share

ఒక భార్యతో ఏగడమే కష్టంరా దేవుడా అని చాలా మంది భావిస్తుంటారు. అలాంటిది ఇద్దరు భార్యలు ఉంటే.. ఇక సీన్ సితారే. అవును, ఇద్దరు భార్యలతో ఓ వ్యక్తి పడే ఇబ్బందులపై అనేక సినిమాలు, సీరియల్స్ వచ్చాయి. నిజ జీవితంలోనూ ఇలాంటివి చూస్తూనే ఉన్నాయి. తెలుగులో స్టార్ హీరో అక్కినేని నాగార్జున నటించిన ‘ఆవిడా.. మా ఆవిడే’ సినిమా గుర్తుందా. ఆ సినిమాలో ఇద్దరు భార్యలను మేనేజ్ చేయలేక నాగార్జున ఎన్ని తంటాలు పడ్డారో చూడొచ్చు. తాజాగా ఓ వ్యక్తి రెండు పెళ్లిళ్లకు సంబంధించిన అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. మరి ఆ వ్యక్తి తన ఇద్దరు భార్యలను ఎలా మేనేజ్ చేశాడు.. ఆ భార్యలు తన భర్తను ఎలా అంగీకరించారు.. వీరి మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది.. ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..

ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గౌతమ్ బుద్ధ నగర్‌లోని జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిలా కాలనీలో నివాసం ఉంటున్న సలీమ్‌ను 2017లో ఓ మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, పెళ్లి తరువాత ఆమెని తన ఇంటికి తీసుకెళ్లకుండా నగరంలోనే ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇక్కడ కాపురం పెట్టాడు. పెళ్లి అయినప్పటి నుంచి తనను అత్తమామల ఇంటికి తీసుకెళ్లాలని భర్తను అనేకసార్లు కోరింది. కానీ, అతను పట్టించుకునేవాడు కాదు. రోజులు దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలో.. కొన్ని రోజుల క్రితం భర్త అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దాంతో భర్త జాడ కోసం ఆమె చేయని ప్రయత్నం లేదు. చివరకు ఎలాగోలా భర్త ఇంటిని కనిపెట్టిన మహిళ.. నేరుగా అత్తమామల ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెకు బిగ్ షాక్ ఎదురైంది. ఇంటికి వెళ్లి చూడగా.. అక్కడ అతని మొదటి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. దాంతో ఆగ్రహానికి గురైన మహిళ.. నేరుగా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేసింది.

మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని ఉత్థాన్ కేంద్రానికి పిలిపించారు. మొదటి భార్య, రెండవ భార్య సమక్షంలో అతన్ని కూర్చొబెట్టి వివరాలు తెలుసుకున్నారు. ముగ్గురుకీ కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, ముగ్గురు కలిసి ఉండేందుకే మొగ్గు చూపారు. తమ మధ్య ఎలాంటి విభేదలు లేవని, కలిసి ఉంటామంటూ పోలీసులకు తెలిపారు. అంతేకాదండోయ్.. భర్త ఎప్పుడు ఎవరి వద్ద ఉండాలనేది కూడా స్టేషన్‌లోనే డిసైడ్ చేశారు. మూడు రోజులు ఒక భార్య వద్ద, మరో మూడు రోజులు ఒక భార్య వద్ద ఉండేలా ఒప్పందం చేసుకున్నారు. ఇక మిగిలిన ఒక రోజు మాత్రం భర్త ఇష్టానికి వదిలేశారు. ఈ ఒప్పందం వివాదానికి ఎండ్ కార్డ్ పడింది. ముగ్గురూ కలిసి స్టేషన్ నుంచి ఇంటికి వచ్చారు. అయితే, రెండ భార్యను ఉంచేందుకు వేరొక గది రెంట్ కోసం ప్రయత్నిస్తున్నాడు సదరు భర్త.

ఇవి కూడా చదవండి

ఇదిలాఉంటే.. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యింది. భర్తను భార్యలు షేర్ చేసుకోవడాన్ని ఫన్నీగా రిసీవ్ చేసుకుంటున్నారు. కొందరు మ్యాటర్‌ను లీగల్ వ్యూ లో చూస్తుంటే.. మరికొందరు బంధంలో సర్దుబాటును చూస్తున్నారు. ఇంకొందరైతే ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. 3 రోజులు ఒకరి ఇంట్లో, 3 రోజులు మరొకరి ఇంట్లో.. 1 రోజు మాత్రం భర్తకు వీకాఫ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..