Orange Benefits: ఈ ఒక్క పండు ఆరోగ్యానికి మెండు.. చలికాలంలో అస్సలు మిస్ కావొద్దు.. ఎందుకంటే..

చలికాలంలో రోగనిరోధకశక్తిపై దృష్టిసారించడం మంచిది. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో

Orange Benefits: ఈ ఒక్క పండు ఆరోగ్యానికి మెండు.. చలికాలంలో అస్సలు మిస్ కావొద్దు.. ఎందుకంటే..
Orange
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 20, 2023 | 5:48 PM

చలికాలంలో రోగనిరోధకశక్తిపై దృష్టిసారించడం మంచిది. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో చాలా మంది చలికాలంలో ఆరెంజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే చలిలో నారింజ పండ్లను తింటే జలుబు, దగ్గు వస్తాయని కొందరు భయపడుతుంటారు. కానీ చలికాలంలో ఆరెంజ్ తినడం ఔషధం కంటే తక్కువేమీ కాదంటూ నిపుణులు పేర్కొంటున్నారు. అవును, ఇందులో నారింజ పండ్లలో చాలా పోషకాలు దాగున్నాయి. వీటిద్వారా చలికాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. చలికాలంలో ఈ పుల్లని పండును తింటే అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నారింజ పండ్లను తినడం ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

చలికాలంలో ఆరెంజ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

  1. రోగనిరోధక శక్తి పెరుగుతుంది: ఆరెంజ్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే శీతాకాలంలో నారింజ పండ్లను తినడం వల్ల జలుబు, దగ్గు, సీజనల్ ఫ్లూని నివారించవచ్చు. ఇది మీ శరీరాన్ని లోపలి నుండి దృఢంగా మార్చి.. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.
  2. చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది: ఆరెంజ్‌లో విటమిన్ సి ఉండటం వల్ల ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీనిని రోజూ తీసుకుంటే చర్మంపై ముడతలు, నల్లటి వలయాల సమస్య తగ్గుతుంది. ఇది మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. అందుకే చలికాలంలో ఆరెంజ్ తినాలి.
  3. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి: వయసు పెరిగే కొద్దీ కంటిచూపు తగ్గుతోందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆహారం మంచిగా తీసుకుంటే.. కంటి చూపు ఎక్కువ కాలం తగ్గదని.. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆరెంజ్‌ను చేర్చుకోవాలి. ముఖ్యంగా ఆరెంజ్, ఆహారంతో కంటికి సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయని.. కంటి చూపు కూడా ప్రకాశవంతంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం..

ఇవి కూడా చదవండి