Rats in Mortuary: నిర్లక్ష్యానికి పరాకాష్ఠ! మార్చురీలో డెడ్‌బాడీ కన్ను కొరుక్కుతిన్న ఎలుకలు..?
మరణించిన వారిని దైవంతో సమానంగా భావిస్తారు. వారి అంతిమవీడ్కోలు శ్రద్ధగా చేస్తారు. ఐతే ఓ వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందగా మార్చురీలో భద్రపరిచారు. ఐతే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మరణించిన వ్యక్తి కన్ను ఊహించని విధంగా..
మరణించిన వారిని దైవంతో సమానంగా భావిస్తారు. వారి అంతిమవీడ్కోలు శ్రద్ధగా చేస్తారు. ఐతే ఓ వ్యక్తి ఆసుపత్రిలో మృతి చెందగా మార్చురీలో భద్రపరిచారు. ఐతే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం మూలంగా మరణించిన వ్యక్తి కన్ను ఊహించని విధంగా కనిపించకుండా పోయింది. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేసుకున్న ఆ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..
మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లా దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. హాస్పిటల్ మార్చురిలో భద్రపరిచిన ఓ మృతదేహం కన్ను కనిపించకుండా పోయింది. దీనిపై స్పందించిన అధికారులు మార్చురీలోని సీసీ టీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. మృతదేహం కంటిని ఎలుకలు కొరికేసి ఉంటాయని వైద్యులు అనుమానిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు హాస్పిటల్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అభిషేక్ ఠాకూర్ మీడియాకు తెలిపారు. కాగా ఇదే హాస్పిటల్‌లో గతంలో కూడా మృతదేహాన్ని ఎలుకలు కొరికిన ఉదంతాలు పలుమార్లు వెలుగులోకొచ్చాయి. ఆసుపత్రిలో ఎలుకల బెడద, వైద్యుల నిర్లక్ష్యంపై రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.