‘ఎమర్జెన్సీ’ కోసం నా ఆస్తులన్నీ తనఖా పెట్టా..: నటి కంగనా ఎమోషనల్‌ పోస్ట్

బాలీవుడ్‌ అగ్రనటి కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఎమర్జెన్సీ'. ఈ మువీ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెల్పుతూ కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఎమోషన్‌ పోస్టు..

'ఎమర్జెన్సీ' కోసం నా ఆస్తులన్నీ తనఖా పెట్టా..: నటి కంగనా ఎమోషనల్‌ పోస్ట్
Kangana Ranaut
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 22, 2023 | 2:08 PM

బాలీవుడ్‌ అగ్రనటి కంగనా రనౌత్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ మువీ కోసం తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తెల్పుతూ కంగనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఎమోషన్‌ పోస్టు పెట్టింది. తన అందం, నటనతో కట్టిపడేసే కంగనా ముక్కుసూటి తనంతో పలు వివాదాల్లో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంది. ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ మువీలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర షూటింగ్‌ పనులు తాజాగా పూర్తయ్యాయి. ‘ఎమర్జెన్సీ’ మువీ నిర్మాణం కోసం ఆర్థికంగా, ఆరోగ్య పరంగా చాలా ఇబ్బంది పడ్డాడనని ఈ బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్ తన ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది.

‘నటిగా ‘ఎమర్జెన్సీ’ షూటింగ్‌ పూర్తి చేశాను. నా జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టం పూర్తిగా పూర్తవుతుంది. ఈ సినిమా షూటింగ్‌ సాఫీగా జరిగిందని చెప్పడం కేవలం అబద్ధమవుతుంది. ఎందుకంటే నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఎమర్జెన్సీ ఫస్ట్‌ షెడ్యూల్‌లో డెంగ్యూ వచ్చింది. ఆ సమయంలో నా రక్త కణాల సంఖ్య తక్కువయ్యాయి. నా మీద నాకే అనుమానం వచ్చే స్థితికి వచ్చాను. ఆ దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడని అనుకున్నాను. నా అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఓపెన్‌గానే పంచుకుంటుంటాను. ఐతే ఎప్పుడూ నా ఆరోగ్యం గురించి ప్రస్తావించలేదు. ఎందుకంటే నన్ను అభిమానించేవారు ఆందోళన చెందడం నాకు ఇష్టం లేదు. ఐతే కొందరు నా పతనాన్ని కోరుకుంటున్నారు. అటువంటి వారికి ఛాన్స్‌ ఇవ్వకూడదు. నేను ఎంతగా బాధపడుతూ ఉన్నా కూడా బయటకు చెప్పలేదు. నా బాధ వారికి ఆనందాన్ని ఇవ్వకూడదని అనుకున్నాను. ఇప్పుడిదంతా ఎందుకు చెబుతున్నానంటే.. కష్టపడి పని చేసేవారిని దేవుడు మరింత ఎక్కువగా పరీక్షిస్తుంటాడు. ఆ పరీక్షల్లో నెగ్గాల్సిందే. దానికి కష్టపడాల్సిందే. సాధించే వరకు వదిలిపెట్టకూడదు. నాకైతే ఇది పునఃజర్మ వంటిది. నాకు సాయం చేసిన టీంకు థాంక్స్. నా గురించి ఎవ్వరూ కంగారు పడకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. మీ ప్రేమ, ఆశీస్సులు నాకు కావాలంటూ’ కంగనా తన పోస్ట్  లో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్‌టైన్‌మెంట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.