Formula E Hyderabad: వేలానికి మహీంద్ర ఎక్స్ క్లూజివ్ XUV400 ఎలక్ట్రిక్ SUV, విజేతకు ఆనంద్ మహీంద్ర చేతుల మీదుగా..
ఇదే క్రమంలో మహీంద్ర సంస్థ తమ సరికొత్త మోడల్ కారు XUV400 ఎలక్ట్రిక్ SUV కి వేలం నిర్వహించి, దానితో వచ్చిన మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ప్రకటించింది. ఆ వేలంలో విజేతకు కారును 2023 ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో జరుగనున్న ఫార్ములా ఈ ఈవెంట్ లో కారును మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేతుల మీదుగా అందించినున్నట్లు వెల్లడించింది.
ప్రతి కార్పొరేట్ కంపెనీ కూడా సామాజిక బాధ్యతగా కొన్ని ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది. కంపెనీలు వారికొచ్చిన లాభాల్లో నుంచి కొంత మొత్తాన్ని వెచ్చిస్తుంటారు. అయితే కొంత ఫండ్ ను సేకరించి కూడా ఛారిటీస్ చేస్తుంటారు. ఇదే క్రమంలో మహీంద్ర సంస్థ తమ సరికొత్త మోడల్ కారు XUV400 ఎలక్ట్రిక్ SUV కి వేలం నిర్వహించి, దానితో వచ్చిన మొత్తాన్ని సామాజిక కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ప్రకటించింది. ఆ వేలంలో విజేతకు 2023 ఫిబ్రవరి 10న హైదరాబాద్ లో జరుగనున్న ఫార్ములా ఈ ఈవెంట్ లో మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా చేతుల మీదుగా కారును అందించినున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహీంద్రా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ ..
మహీంద్రా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ XUV400 ఎలక్ట్రిక్ SUV కారును సెప్టెంబర్ 2022లో భారతదేశంలో ప్రదర్శించింది. దీనిని మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్, ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రిమ్జిమ్ దాదు సహకారంతో రూపొందించారు. ఈకారుకు వేలం నిర్వహించి, అత్యధిక బిడ్డర్‌కు కారును అందివ్వనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. 2023 ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరిగే ఫార్ములా ఈ లో జరిగే ప్రత్యేక మహీంద్రా ఈవెంట్‌లో కారును విజేతకు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అందజేయనున్నారు.
వేలం ఎప్పుడు ప్రారంభం అంటే..
వేలం జనవరి 26, 2023న ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. జనవరి 31, 2023న రాత్రి 11:59 గంటలకు ముగుస్తుంది. ఆసక్తి గల కస్టమర్‌లు వేలం కోసం నమోదు చేసుకోవడానికి కార్&బైక్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చిస్తామని కంపెనీ తెలిపింది. నవంబర్ 28, 2022న ప్రకటించిన మహీంద్రా రైజ్ సస్టైనబిలిటీ ఛాంపియన్ అవార్డ్స్ విజేతలకు మద్దతుగా తమ బిడ్‌ను విరాళంగా ఇవ్వడానికి వేలం విజేతకు అవకాశం ఉంటుందని వివరించింది. అంతేకాకుండా, వేలం విజేత ఫిబ్రవరి 11, 2023న హైదరాబాద్‌లో జరిగే ఆల్-ఎలక్ట్రిక్ FIA ఫార్ములా E ఛాంపియన్‌షిప్, భారత ప్రారంభ రౌండ్‌ను చూడటానికి ప్రత్యేకమైన పాస్‌ను కూడా అందిస్తారని పేర్కొంది.
ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ XUV400 గురించి మహీంద్రా & మహీంద్రా చీఫ్ డిజైన్ ఆఫీసర్ ప్రతాప్ బోస్ మాట్లాడుతూ, తాము ఈ కారు కోసం అవార్డ్ విన్నింగ్ ఫ్యాషన్ డిజైనర్ రిమ్‌జిమ్ దాదుతో కలిసి పని చేసామన్నారు, ఈ కారు ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో ఎంతో అందంగా ఉంటుందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికతతో పాటు, అద్భుతమైన హస్తకళ సమ్మిళితంగా ఈ కారు తయారైంది పేర్కొన్నారు. దే సమయంలో, రిమ్జిమ్ దాదు మాట్లాడుతూ, మహీంద్రా తన మొదటి e- SUV తయారీ కోసం మహీంద్రా కంపెనీ, ప్రతాప్ బోస్‌లతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించినట్లు చెప్పారు. దీనిని ఓ గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కారు వివరాలు ఇవి..
మహీంద్రా ఎక్స్‌క్లూజివ్ ఎడిషన్ XUV400 విషయానికొస్తే, ఎలక్ట్రిక్ SUV బానెట్, D పిల్లర్,టెయిల్‌గేట్‌పై ‘రిమ్‌జిన్ దాదు x బోస్’ బ్యాడ్జ్‌లను వినియోగించారు. క్యాబిన్ విషయానికొస్తే, ఇది ప్రామాణిక XUV400 యొక్క బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. సీట్ ఫ్యాబ్రిక్‌లతో ఇప్పుడు భారతీయ ఫ్యాషన్ నుండి ప్రేరణ పొందిన కొన్ని ప్రత్యేకమైన డిజైన్ టచ్‌లను పొందుతోంది. సీట్లు హెడ్‌రెస్ట్‌లలో ఎంబ్రాయిడరీ చేయబడిన ‘రిమ్‌జిన్ దాదు x బోస్’తో రాగి కుట్టును కలిగి ఉంటాయి, అయితే బ్లూ డిజైన్ అంశాలు ఇప్పుడు బ్యాక్‌రెస్ట్‌లో చేర్చబడ్డాయి.
స్పసిఫికేషన్లు ఇవి..
ప్రామాణిక XUV400 రెండు వెర్షన్లలో వస్తోంంది. EC వెర్షన్ 34.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో , 375 km రేంజ్ తో వస్తుంది. EL వెర్షన్ 39.4 kWh యూనిట్ తో 456 km రేంజ్ ను అందిస్తుంది. XUV400 వేలం ధరను ఇంకా నిర్ధారించలేదు. ప్రామాణికంగా ఈ వాహనం ధర రూ. 15.99 లక్షల నుండి రూ. 18.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా) ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..