AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Retirement Planning: ఈ ప్రభుత్వ పెన్షన్ పథకాలతో పదవీ విరమణ తర్వాత సుఖమయ జీవనం.. బెస్ట్ ఆప్షన్స్.. అస్సలు మిస్ అవ్వద్దు..

చాలా మంది పదవీవిరమణకు చాలా సమయం ఉంది కదా.. తర్వాత చూసుకుందాంలే అని అనుకొని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే చాలా మంది నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే.. సంపాదన ప్రారంభంలోనే కొన్ని రైటర్మెంట్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదట.

Retirement Planning: ఈ ప్రభుత్వ పెన్షన్ పథకాలతో పదవీ విరమణ తర్వాత సుఖమయ జీవనం.. బెస్ట్ ఆప్షన్స్.. అస్సలు మిస్ అవ్వద్దు..
Retirement Planning
Follow us
Madhu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2023 | 4:48 PM

జీవితంలో ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. ముఖ్యంగా పదవీవిరమణ అనంతరం సుఖమయ జీవితం గడపటానికి, ఎవరిపైనా ఆధారపడకుండా జీవించడానికి ఈ ఆర్థిక ప్రణాళిక తోడ్పడుతుంది. చాలా మంది పదవీవిరమణకు చాలా సమయం ఉంది కదా.. తర్వాత చూసుకుందాంలే అని అనుకొని పక్కన పెట్టేస్తూ ఉంటారు. అయితే చాలా మంది నిపుణులు చెబుతున్న విషయం ఏమిటంటే.. సంపాదన ప్రారంభంలోనే కొన్ని రైటర్మెంట్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదట. మనకు చాలా రిటైర్మెంట్ పథకాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అయితే ఎక్కువ మంది  ప్రభుత్వ పథకాలైతేనే సురక్షితమని భావిస్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెస్ట్ పదవీ విరమణ పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

అటల్ పెన్షన్ పథకం..

18 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ఎవరైనా ఈ పదవీ విరమణ ప్రణాళికలో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్‌లో, ఒక వ్యక్తి 60 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి నెలా చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెట్టాలి. 60 సంవత్సరాల వయస్సు తర్వాత, పెట్టుబడిదారులు నెలవారీ పెన్షన్‌ను రూ. 1000 నుండి రూ. 5000 వరకు పొందుతారు. పదవీ విరమణ తర్వాత వారు పొందాలనుకుంటున్న పెన్షన్ మొత్తాన్ని బట్టి.. నెలవారీ కంట్రిబ్యూషన్ మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి, ఒక సేవింగ్స్ ఖాతా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఉండాలి.

ప్రధాన మంత్రి వయ వందన యోజన..

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టుబడిదారులకు ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని అందిస్తుంది. ఈ పథకంలో ఎవరైనా సీనియర్ సిటిజన్ గరిష్టంగా రూ. 15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. 10 సంవత్సరాల వరకు పెన్షన్ పొందవచ్చు. పెట్టుబడి మొత్తం మీద పెన్షన్ మొత్తం ఆధారపడి ఉంటుంది. ఈ పథకంలో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, వారికి పదేళ్లపాటు నెలవారీ పెన్షన్‌గా రూ.9,250 లభిస్తుంది. ఆన్‌లైన్ ఆఫ్‌లైన్‌లో పథకాన్ని ప్రారంభించవచ్చు. ఈ సంవత్సరంలో గనుక మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే ఆఖరి గడువు మార్చి 31 2023.

ఇవి కూడా చదవండి

సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ (SCSS)..

60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పౌరులు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇది కాకుండా, 55 నుంచి 60 సంవత్సరాల మధ్య వాలంటరీ రిటైర్మెంట్ (VRS) తీసుకునే వాలంటరీ రిటైర్మెంట్ (VRS) కూడా ఈ ప్లాన్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ప్లాన్‌లో కనీసం రూ. 1000, గరిష్టంగా రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జనవరి 1 నుంచి ఈ పథకంలో కొత్త వడ్డీ రేటు అమల్లోకి రాగా.. ప్రస్తుతం పెట్టుబడిదారులకు 8 శాతం వడ్డీ లభిస్తోంది. త్రైమాసిక ప్రాతిపదికన డిపాజిట్ మొత్తానికి వడ్డీ చెల్లిస్తారు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)..

నెలవారీ పెన్షన్ పొందడానికి NPS మంచి ఎంపిక. ఈ స్కీమ్‌లో జమ చేసిన మొత్తంలో ఎక్కువ భాగం మార్కెట్‌లో పెట్టుబడి పెట్టబడుతుంది, కాబట్టి సగటున, పెట్టుబడిదారుడికి 10 శాతం రాబడి లభిస్తుంది. 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు గల భారతీయ పౌరులు ఈ ప్లాన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పెన్షన్ పొందాలంటే 60 ఏళ్ల వరకు పెట్టుబడి పెట్టాలి. అయితే, రిటైర్‌మెంట్‌కు ముందు ఖాతాదారుడికి అత్యవసరంగా నిధి అవసరమైతే, అతను/ఆమె డిపాజిట్ నుండి 60 శాతం మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, 40 శాతం యాన్యుటీగా వినియోగిస్తారు. యాన్యుటీ ఎక్కువ మొత్తం ఉంటేనే పెన్షన్ ఎక్కువ వస్తుందన్న విషయం గుర్తుంచుుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..