Devot E-Bike: సూపర్ లుక్ తో డివోట్ ఈ-బైక్..ఓ సారి చార్జి చేస్తే 200 కిలోమీటర్ల మైలేజ్
దేశీయ స్టార్టప్ కంపెనీ డీవోట్ మోటర్స్ కూడా తమ నూతన బైక్ ను లాంచ్ చేసింది. సూపర్ లుక్ తమ ఎలక్ట్రిక్ బైక్ డీవోట్ ను పరిచయం చేసింది. దీని డిజైన్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ట్యాంక్ నుంచి బ్యాటరీ ప్రాంతం వరకూ పూర్తిగా ప్యాక్ చేసినట్లు ఉండడంతో చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన బైక్ అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.
గ్రేటర్ నోయిడా లో నిర్వహిస్తున్న ఆటో ఎక్స్ పో 2023 ముగిసింది. ఈ ఈవెంట్ లో చాలా కంపెనీలు తమ ఈ బైక్ లు లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ కోవలో దేశీయ స్టార్టప్ కంపెనీ డీవోట్ మోటర్స్ కూడా తమ నూతన బైక్ ను లాంచ్ చేసింది. సూపర్ లుక్ తమ ఎలక్ట్రిక్ బైక్ డీవోట్ ను పరిచయం చేసింది. దీని డిజైన్ చూడడానికి చాలా విచిత్రంగా ఉంటుంది. ట్యాంక్ నుంచి బ్యాటరీ ప్రాంతం వరకూ పూర్తిగా ప్యాక్ చేసినట్లు ఉండడంతో చూడడానికి చాలా కొత్తగా ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన బైక్ అని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ బైక్ ను ఓ సారి ఏకంగా 200 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుందని తెలిపారు. ఆటో ఎక్స్ పో 2023 లో ప్రదర్శించిన బైక్స్ లో ఈ న్యూ స్టార్టప్ కంపెనీ ఈ బైక్ లాంచ్ తో తన ప్రత్యేకతను నిలుపుకుంది. ఈ బైక్ లో వచ్చే అధునాతన ఫీచర్లు ఏంటో ఓ సారి చూద్దాం.
డీవోట్ ఈ బైక్ బ్యాటరీ
డీవోట్ ఎలక్ట్రిక్ బైక్ లో 9.5 కేడబ్ల్యూ అధునాతన పనితీరు కనబరిచే బ్యాటరీను అమర్చారు. కేవలం మూడు గంటల్లో బ్యాటరీ పూర్తిగా చార్జ్ అవుతుంది. అలాగే ఓ సారి చార్జ్ చేస్తే 200 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. అలాగే ఈ బైక్ గరిష్ట వేగం గంటకు 120 కిలో మీటర్లు. డీవోట్ మోటార్స్ యూకేలో తన ఆర్ అండ్ డీ కేంద్రం ఉందని ప్రకటించింది. అలాగే ఈ బైక్ అభివృద్ధి కేంద్రం మాత్రం రాజస్థాన్ లో ఉంది. కాబట్టి తమ బైక్స్ ను 90 శాతం వరకూ భారతదేశంలోనే ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.
డీవోట్ ఈ-బైక్ ఫీచర్లు
డీవోట్ ఈ-బైక్ లో అధునాతన టీఎఫ్ టీ స్క్రీన్, యాంటీ థెఫ్ట్ తో కీలెస్ స్టార్ట్-స్టాప్, అలాగే అదనపు టైప్ 2 చార్జింగ్ పాయింట్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంటుంది. బ్యాటరీ ను సురక్షితంగా ఉంచడానికి లిథియం ఎల్ ఎఫ్ పీ బ్యాటరీ కెమిస్ట్రీను అనుసరిస్తుంది. ఇది థర్మల్ మేనేజ్ మెంట్ సమస్యల నుంచి బ్యాటరీను కాపాడుతుందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. తమ ఈ బైక్ లు అధునాతన సాంకేతికత, అద్భుతమైన కాన్ఫిగరేషన్ తో డీవోట్ ఎలక్ట్రిక్ బైక్ లు ఈ బైక్ సెగ్మెంట్ ను మరింత ముందుకు తీసుకెళ్లగలుగుతుందని డీవోట్ వ్యవస్థాపకుడు, సీఈఓ వరుణ్ దేవ్ పన్వార్ పేర్కొన్నారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..