Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Auto Expo 2023: మార్కెట్లోకి సరికొత్త బైక్‌.. బ్యాట్‌మెన్‌ సినిమాలో హీరో నడిపించిన బైక్‌లా లుక్స్‌.. 680 సీసీ పవర్‌ఫుల్‌ ఇంజిన్‌

చైనా బైక్ తయారీ సంస్థ బెండా తన న్యూ బైక్ ను ఆటో ఎక్స్ పోలో లాంచ్ చేసింది. బెండా ఎల్ఎఫ్ సీ 700 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ చూడడానికి బ్యాట్ మెన్ సినిమాలోని సూపర్ బైక్ ను పోలి ఉండడంతో అందరూ ఈ బైక్ ను ఇష్టపడుతున్నారు.

Auto Expo 2023: మార్కెట్లోకి సరికొత్త బైక్‌.. బ్యాట్‌మెన్‌ సినిమాలో హీరో నడిపించిన బైక్‌లా లుక్స్‌.. 680 సీసీ పవర్‌ఫుల్‌ ఇంజిన్‌
Benda Lfc700
Follow us
Srinu

| Edited By: Anil kumar poka

Updated on: Jan 19, 2023 | 7:50 PM

నోయిడాలో జరుగుతున్న ఆటో ఎక్స్ పో 2023 లో వివిధ బైక్ లు ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా స్పోర్టీ లుక్ తో వచ్చే బైక్ లు ఆకట్టుకుంటున్నాయి. కొన్ని బైక్ లు మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటుంటే.. మరికొన్ని బైక్ లను మాత్రం ఉన్నత శ్రేణి వారిని టార్గెట్ చేస్తూ రిలీజ్ చేస్తున్నారు. చైనా బైక్ తయారీ సంస్థ బెండా తన న్యూ బైక్ ను ఆటో ఎక్స్ పోలో లాంచ్ చేసింది. బెండా ఎల్ఎఫ్ సీ 700 పేరుతో రిలీజ్ చేసిన ఈ బైక్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ బైక్ చూడడానికి బ్యాట్ మెన్ సినిమాలోని సూపర్ బైక్ ను పోలి ఉండడంతో అందరూ ఈ బైక్ ను ఇష్టపడుతున్నారు. ఈ బైక్ ఫీచర్స్, ధర విషయాలను ఓ సారి చూద్దాం.

బెండా ఎల్ఎఫ్ సీ 700 మిడిల్ వెయిట్ క్రూయిజర్ బైక్. ఈ 680 సీసీ ఇంజిన్ తో వస్తుంది. ఈ ఇంజిన్ 11,000 ఆర్ పీఎం వద్ద 91 బీహెచ్ పీ, 8500 ఆర్ పీఎం వద్ద 63 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ 6 గేర్లతో వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఎల్ఎఫ్ సీ 700 రెండు వేరియంట్లల్లో అందుబాటులో ఉంది. అలాగే ఈ బైక్ కు వచ్చే హెడ్ ల్యాంప్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. 20 లీటర్ల ట్యాంక్ కెపాసిటీతో వచ్చే ఈ బైక్ లాంగ్ రైడ్స్ కు అనువుగా ఉంటుంది. అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ సీట్ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈ బైక్ దాదాపు 275 కిలోల బరువు ఉంటుంది.

స్పీడ్, ధర

ఈ బైక్ గంటకు 195 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్లనుంది. ఫ్రంట్ డ్యుయల్ డిస్క్ బ్రేక్,  బ్యాక్ సైక్ సింగిల్ డిస్క్ బ్రేక్ తో వస్తుంది. అలాగే ఈ బైక్ లో డ్యుయల్ చానల్ ఏబీఎస్ ఉంటుంది. ఈ బైక్ ధర దాదాపు 5.57 లక్షలుగా ఉండనుంది. అయితే ఈ బైక్ భారత్ మార్కెట్లోకి ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటుందో కంపెనీ ధ్రువీకరించలేదు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..