TATA New EV Car: మార్కెట్‌లోకి మరో న్యూ ఈవీ సూపర్ కారు.. 30 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం..

కొత్త మోడల్ టాటా అవిన్య ఈవీ తో ముందుకు వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ను స్టైలిష్, సున్నిత ఎంపీవీగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ గ్రౌండ్ అప్ ఎలక్ట్రిక్ కార్ ఆటో ఎక్స్ పోలోని ఔత్సాహికులందరి ప్రశంసలు పొందింది.

TATA New EV Car: మార్కెట్‌లోకి మరో న్యూ ఈవీ సూపర్ కారు.. 30 నిమిషాల ఛార్జ్‌తో 500 కిమీ ప్రయాణం..
Tata Avinya
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 21, 2023 | 9:03 PM

భారతీయ కార్ల తయారీ సంస్థ టాటా ఆటో ఎక్స్ పో 2023 లో మరో కొత్త సూపర్ ఈవీ కార్ ను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఎస్ యూవీ, కాన్సెప్ట్ లు, ఫేస్ లిఫ్ట్ ల వంటి అద్భుత లైనప్ లను ఇప్పటికే టాటా ప్రదర్శించింది. ఈ సెగ్మెంట్ లో కొత్త మోడల్ టాటా అవిన్య ఈవీ తో ముందుకు వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కార్ ను స్టైలిష్, సున్నిత ఎంపీవీగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ గ్రౌండ్ అప్ ఎలక్ట్రిక్ కార్ ఆటో ఎక్స్ పోలోని ఔత్సాహికులందరి ప్రశంసలు పొందింది. అలాగే ఈ కార్ ను 2025 లో భారత మార్కెట్ లో ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తాజా నివేవదికలు పేర్కొంటున్నాయి. అలాగే కంపెనీ ప్రతినిధులు ఈ కార్ గురించి చెప్పిన అదనపు ఫీచర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

టాటా అవిన్య ఈవీ కార్ అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీకి మద్దతునిస్తుంది. ఈ కార్ ను కేవలం 30 నిమిషాలు చార్జ్ చేస్తే 500 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. అలాగే అవిన్య కార్ జెన్ 3 ఆర్కిటెక్చర్ పై ఆధారపడి ఉంటుంది. అలాగే ఈ కార్ చాలా కొత్త డిజైన్ తో ఉంది. టాటా నుంచి భవిష్యత్ లో వచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు ఎలా ఉండబోతున్నాయో? అనే దానికి సూచనగా ఈ కొత్త కార్ ఉంది. అలాగే టాటా లోగోను కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు. అలాగే ఈ కార్ డోర్స్ కూడా సీతాకోక చిలుక రెక్కల రూపంలో అందంగా ఉంటాయి. అలాగే ఈ తలుపుల వల్ల కార్ కు చాలా స్పోర్టీ లుక్ వచ్చింది. 

అవిన్య కార్ ఇంటీరియర్ సాదా డ్యాష్ బోర్డ్ లే అవుట్ తో వస్తుంది. అయితే ఈ కార్ లోపల ఎలాంటి టచ్ స్క్రీన్ డిస్ ప్లే లు లేవు. అలాగే టాటా తన భవిష్యత్ లో ఈవీ వాహనాలన్నీ వాయిస్ కంట్రోల్ తో పని చేసేలా ప్రయత్నాలు చేస్తుంది కాబట్టి ఈ కార్ లో టచ్ స్క్రీన్ డిస్ ప్లేలు లేవని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే ఈ సీట్లకు ఉండే హెడ్ రెస్ట్ లో ఇంటిగ్రేటెడ్ స్పీకర్లతో వస్తుంది. అలాగే ఈ కార్ లో సౌకర్యవంతమైన క్యాబిన్, అనేక టెక్నాలజీ ఎయిడెడ్ ఫీచర్ల ద్వారా ప్రీమియం కస్టమర్ అనుభవాన్ని అందిస్తుంది. కాబట్టి ఉన్నత శ్రేణి వాళ్లను దృష్టిలో పెట్టుకుని రిలీజ్ చేసిన ఈ కార్ వారి ఆదరణను పొందుతుందో? లేదో? మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాక చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..