AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Xiaomi New Electric Car: జియోమీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. డ్రైవింగ్ చేస్తూ కార్‌ను పరీక్షించిన సీఈఓ..?

మొబైల్ తయారీ సంస్థ జియోమీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారు చేస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కానీ కంపెనీ ఈ వార్తలను ధ్రువీకరించలేదు. ముఖ్యంగా ఈవీ మార్కెట్ లోకి టాప్ టెక్ కంపెనీ లు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోనీ, యాపిల్, అప్పో వంటి కంపెనీలు ఈవీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి.

Xiaomi New Electric Car: జియోమీ నుంచి సరికొత్త ఎలక్ట్రిక్ కార్.. డ్రైవింగ్ చేస్తూ కార్‌ను పరీక్షించిన సీఈఓ..?
Xiaomi Electric Car
Nikhil
| Edited By: |

Updated on: Jan 21, 2023 | 8:18 PM

Share

పెరుగుతున్న ఇందన ధరల నేపథ్యంలో వినియోగదారులంతా ఎలక్ట్రిక్ కార్లు, బైక్ ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే ఎక్కువ మార్కెట్ కలిగిన భారత్ లో వివిధ కార్లు, బైక్ కంపెనీలు తమ కొత్త ఈవీ మోడళ్లను రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇదే కోవలో మొబైల్ తయారీ సంస్థ జియోమీ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఎలక్ట్రిక్ కార్ల తయారు చేస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. కానీ కంపెనీ ఈ వార్తలను ధ్రువీకరించలేదు. ముఖ్యంగా ఈవీ మార్కెట్ లోకి టాప్ టెక్ కంపెనీ లు ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోనీ, యాపిల్, అప్పో వంటి కంపెనీలు ఈవీ మార్కెట్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అయితే యాపిల్ కూడా 2025 లో ఎలక్ట్రిక్ కార్ ప్రవేశపెడుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. అయితే 2026లో యాపిల్ కొత్త ఈవీ కార్ మార్కెట్ లోకి వస్తుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు జియోమీ కూడా ఈవీ మార్కెట్ లోకి రావడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది.

చైనాలోని మంచు రోడ్లల్లో జియోమీ ఈవీ కార్ ను పరీక్షించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. జియోమీ వ్యవస్థాపకుడు, సీఈఓ లీ జున్ న్యూ ఈవీ కార్ ను రైడ్ చేస్తూ కనిపించారని కొన్ని ఫొటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫొటోను పరిశీలిస్తే జియోమీ తన న్యూ ఎలక్ట్రిక్ కార్ గురించి చాలా విషయాలను గోప్యంగా ఉంచింది. అయితే ఈ కార్ చూడడానికి చాలా క్లాసీ లుక్ తో ఎలిగెంట్ డిజైన్ తో వస్తుందని తెలుస్తోంది. ఈ కార్ స్పోర్టీ సెడాన్ గా కనిపిస్తుందని పలు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ కార్ లైడార్ సెన్సార్ ఉందని, డ్రైవింగ్ లేదా ఆటోమేటిక్ డ్రైవింగ్ ద్వాారా పని చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే ఈ కార్ గురించి అదనపు విషయాలు వెల్లడికావాల్సి ఉంది. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
భక్తితో గుడికెళ్లారనుకుంటే.. ఈ భార్యాభర్తలు ఏకంగా దేవుడికే..
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
2025లో ఆంధ్రప్రదేశ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఘోర ప్రమాదాలు ఇవే
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ..ఫోర్లు, సిక్సర్లతోనే 50 కొట్టిన కోహ్లీ
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
ఎంతకు తెగించార్రా.. 'అమ్మ' పేరుతో మంచి మనిషిని మోసం చేశారు కదరా!
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
దేశ ప్రజలకు శుభవార్త.. తక్కువ ధరకే సేవలు.. జనవరి 1 నుంచే అమల్లోకి
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
శుభలేఖ పంపండి.. శ్రీవారి ఆశీస్సులు పొందండి వీడియో
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
రజినీకాంత్ సినిమా వల్లే నా కెరీర్ పోయింది..
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో