EPFO: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈపీఎఫ్‌ఓ నుంచి అధిక పెన్షన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..

Subhash Goud

Subhash Goud |

Updated on: Jan 21, 2023 | 1:39 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు అధిక పెన్షన్ ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం..

EPFO: సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈపీఎఫ్‌ఓ నుంచి అధిక పెన్షన్‌.. దరఖాస్తు చేసుకోండిలా..
Higher Pension Apply

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) సభ్యులకు అధిక పెన్షన్ ఎంచుకునే ఆప్షన్ ఇవ్వాలని ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ కోసం అర్హతలకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా అధిక పెన్షన్‌ పొందడానికి ఈపీఎఫ్‌వో సభ్యులకు నిబంధనలు, షరతులను జారీ చేసింది. అధిక పెన్షన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలిపింది. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఈపీఎఫ్‌వో చందాదారులు అధిక పెన్షన్‌కు అర్హులని ఈపీఎఫ్‌వో ఓ సర్క్యూలర్‌ జారీ చేసింది. అయితే పోర్టల్ లింక్‌లో ఇంతకుముందు దరఖాస్తులు తిరస్కరించబడిన ఉద్యోగుల కోసం మాత్రమే ఈ ధ్రువీకరణ దరఖాస్తు ఫారమ్‌ అందుబాటులో ఉంటుంది. సెప్టెంబరు 1, 2014 కంటే ముందు పదవీ విరమణ చేసిన ఉద్యోగులు మాత్రమే పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మార్చి 3 వరకు తమ దరఖాస్తులను అప్‌లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 4, 2022 నాటి తీర్పునకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం దీని అమలుకు సంబంధించి ఈపీఎఫ్‌వో ప్రాథమిక ఉత్తర్వు డిసెంబర్‌ 29, 2022న జారీ చేసింది.

ఇంతకు ముందు దరఖాస్తులు తిరస్కరించిన వారికి అధిక పెన్షన్‌ ఆప్షన్‌ను అందించాలని పేర్కొంటూ ఈపీఎఫ్‌వో ఉత్తర్వు విడుదలైంది. అయితే పోర్టల్‌లో తీర్పులోని పేరా 44 (ix)లో ఉన్న ఆదేశాలకు అనుగుణంగా ధృవీకరణ కసం దరఖాస్తును దాఖలు చేయడానికి యూనిఫైడ్‌ పోర్టల్‌ మెంబర్‌ ఇంటర్‌ఫేస్‌ ఆన్‌లైన్‌ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

అధిక పెన్షన్‌కు ఎలా దరఖాస్తు చేయాలి?

అర్హులైన ఈపీఎస్ సభ్యులు సంబంధిత ప్రాంతీయ ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లి, అవసరమైన డాక్యుమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ధృవీకరణ కోసం దరఖాస్తు ఫామ్‌పైప ప్రభుత్వ నోటిఫికేషన్‌లో ఆదేశించిన విధంగా డిస్‌క్లెయిమర్ ఉండాలి. పీఎం నుంచి పెన్షన్ నిధులకు డబ్బులు సర్దుబాటు అవసరమయ్యేలా ఉంటే, పెన్షనర్ స్పష్టమైన సమ్మతి కావాల్సి ఉంటుంది. మినహాయింపు పొందిన పీఎఫ్‌ ట్రస్ట్‌ నుంచి ఈపీఎఫ్‌వో పెన్షన్ నిధులకు ఫండ్‌ను బదిలీ చేసిన సందర్భంలో, ట్రస్టీ అండర్‌టేకింగ్ సమర్పించబడుతుందని గుర్తించుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu