Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.40లకే 5 స్టార్‌ హోటల్‌ రేంజ్‌లో రూమ్స్‌

భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం రకరకాల సేవలను అందిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ..

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. కేవలం రూ.40లకే 5 స్టార్‌ హోటల్‌ రేంజ్‌లో రూమ్స్‌
Irctc Rooms
Follow us
Subhash Goud

|

Updated on: Jan 21, 2023 | 8:19 AM

భారత రైల్వే శాఖ ప్రయాణికుల కోసం రకరకాల సేవలను అందిస్తోంది. ప్రతి రోజు లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ ఎన్నో సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తుంటుంది. ఇక రైల్వే సదుపాయాల్లో ప్రధానంగా వెయిటింగ్‌ రూమ్‌. ప్రయాణికులు రైల్వే స్టేషన్‌లో ఉండే వెయిటింగ్‌ హాల్‌లో రైలు వచ్చే వరకు వేచి ఉండవచ్చు. అదేవిధంగా ఏదైనా కారణంతో చివరి క్షణాలలో రైలును రద్దు చేసిన, రీ షెడ్యూల్ చేసిన సందర్భాల్లో వేచి ఉండేందుకు అక్కడ గదులు కూడా ఉంటాయి. అయితే ఈ సదుపాయం టికెట్ రిజర్వ్ చేసుకున్న ప్రయాణికులకు మాత్రమే వర్తిస్తుంది.

ఇక్కడ మీరు కేవలం రూ. 40తో విలాసవంతమైన గదిలో 48 గంటలు ఉండవచ్చు. మీరు ఇండియన్ రైల్వే రిటైరింగ్ రూమ్‌లో లగ్జరీ హోటల్‌లో అన్ని సౌకర్యాలను పొందుతారు. చాలా ప్రధాన స్టేషన్లలో ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది రైల్వే శాఖ. చలికాలంలో రైళ్లు చాలా ఆలస్యంగా నడుస్తాయి. దీంతో ప్రయాణికులు నిరీక్షించాల్సి వస్తోంది. చలికి కూడా అనేక మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు అలాంటిదేమి జరగకుండా రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఆర్‌సీటీసీ ఈ సేవను ప్రారంభించింది.

భారతీయ రైల్వే తన ప్రయాణీకుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని విలాసవంతమైన రిటైరింగ్ గదులను సిద్ధం చేసింది. ఈ గదిని బుక్ చేయడానికి మీ వద్ద తప్పనిసరిగా పీఎన్‌ఆర్‌ నంబర్ ఉండాలి. మీరు రైల్వే రిటైరింగ్ రూమ్‌లో ఈ సదుపాయాన్ని పొందుతారు. మీరు ఈ గదిలో 48 గంటల పాటు ఉండవచ్చు. ఇక్కడ మీ నుండి 20-40 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. ఇందులో అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ప్రధాన స్టేషన్లలో రిటైరింగ్ రూమ్ సౌకర్యం:

న్యూఢిల్లీ, ముంబై, పూణే వంటి అన్ని ప్రధాన స్టేషన్లలో రిటైరింగ్ రూమ్‌ల సౌకర్యం అందుబాటులో ఉందని రైల్వే శాఖ తెలిపింది. మీరు మీ టికెట్ పీఎన్‌ఆర్‌ నంబర్‌ని ఉపయోగించి ఈ గదులను బుక్ చేసుకోవచ్చు. మీరు మీ సౌలభ్యం ప్రకారం ఏసీ, నాన్ ఏసీ గదులను బుక్ చేసుకోవచ్చు. రిటైరింగ్ రూమ్ మీకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన కేటాయించబడుతుంది. ఒకవేళ రూమ్‌లు వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటుంది. గదులు ఖాళీ అయిన వెంటనే మీ బుకింగ్ అప్‌గ్రేడ్ చేయబడుతుంది.

☛ గదిని బుక్‌ చేసుకోవడానికి ముందుగా ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ irctctourism.comని సందర్శించాలి.

☛ హోమ్‌ పేజీలో రిటైరింగ్‌ రూమ్‌ సౌకర్యం సంబంధిత స్టేటషన్‌లో అందుబాటులో ఉందో లేదో చూడడానికి ఇండియన్‌ రైల్వే రిటైరింగ్‌ రూమ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

☛ తర్వాత రిటైరింగ్‌ రూమ్‌ బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.

☛ మీరు పీఎన్‌ఆర్‌ నంబర్‌, ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి.

☛ దీని తర్వాత డీలక్స్‌/ఏసీ/ నాన్‌ ఏసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

☛ తర్వాత బుకింగ్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేసి రుసుము చెల్లించాలి.

☛ మీ రూమ్‌ బుక్‌ అవుతుంది. ఐఆర్‌సీటీసీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు రిటైరింగ్‌ రూమ్‌ నంబర్‌ తదితర వివరాలు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయి.

40 రూపాయలకే ఫైవ్ స్టార్ రూమ్‌:

రైల్వే స్టేషన్‌లో రైలు ఆలస్యమైనా లేదా రద్దు చేసినా, ఇప్పుడు ప్రయాణికులు చలిలో ఇబ్బందులు పడుతూ ప్లాట్‌ఫారమ్‌పై నిలబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మీరు రిటైరింగ్ రూమ్‌ను రూ.40కే బుక్ చేసుకోవచ్చు. రైల్వే రిటైరింగ్ రూమ్‌లో సౌకర్యాలు బాగానే ఉంటాయి. ఈ రిటైరింగ్ రూమ్‌లను కనిష్టంగా 3 గంటలు, గరిష్టంగా 48 గంటల వరకు బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఏసీ డీలక్స్, ఏసీ, నార్మల్ రూమ్ ఆప్షన్ కూడా ఉంటాయి. సింగిల్ ప్యాసింజర్లకు సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ ప్యాసింజర్లకు డబుల్ బెడ్‌రూమ్‌లను బుక్‌ చేసుకోవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?