Xiaomi Book Air 13: షావోమి నుంచి మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌.. లుక్‌, ఫీచర్లు అదుర్స్‌ అంతే..

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ తయారీ సంస్థ షావోమి స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా షావోమి ల్యాప్‌టాప్‌లను సైతం తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా షావోమీ బుక్‌ ఎయిర్‌ 13 పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను..

Xiaomi Book Air 13: షావోమి నుంచి మార్కెట్లోకి కొత్త ల్యాప్‌టాప్‌.. లుక్‌, ఫీచర్లు అదుర్స్‌ అంతే..
Xiaomi Book Air 13
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 29, 2022 | 4:54 PM

చైనాకు చెందిన ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్ తయారీ సంస్థ షావోమి స్మార్ట్‌ ఫోన్‌, స్మార్ట్‌ గ్యాడ్జెట్‌ మార్కెట్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా షావోమి ల్యాప్‌టాప్‌లను సైతం తీసుకొస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా షావోమీ బుక్‌ ఎయిర్‌ 13 పేరుతో కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్‌ చేసింది. చైనాలో విడుదల చేసిన ఈ ల్యాప్‌టాప్‌ను భారత్‌లో ఎప్పుడు విడుదల చేయనున్నారన్న విషయాన్ని మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇంతకీ ల్యప్‌టాప్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

12వ జనరేషన్‌ ఇంటెల్‌ కోర్‌ సీపీయూతో పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో 16GB వరకు LPDDR5 RAM, 512GB SSD స్టోరేజ్‌ని అందించారు. ఇక స్క్రీన్‌ విషయానికొస్తే 13.3 ఇంచెస్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్‌, గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఈ స్క్రీన్‌ను ప్రత్యేకంగా అందించారు. 2880x1800px రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్‌ ప్రత్యేకతలు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 65 వాట్స్‌ ఫాష్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 58.3 డబ్ల్యూహెచ్‌ఆర్‌ బ్యాటరీని అందించారు.

Xiaomi Book Air 13 Price

ఇవి కూడా చదవండి

డాల్బీ అట్మోస్‌ స్టీరియో స్పీకర్లతో రూపొందించిన ఈ ల్యాప్‌ట్యాప్‌ విండోస్ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పని చేస్తుంది. WiFi-6E, బ్లూటూత్ 5.2, రెండు థండర్‌బోల్ట్ 4 పోర్ట్‌లు, ఒక ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ అందించారు. ఈ ల్యాప్‌టాప్‌ను ఐ5, ఐ7 పేర్లతో వేరియంట్లలో తీసుకొచ్చారు. ఐ7 ధర విషయానికొస్తే భారత కరెన్సీలో రూ. 79,753కాగా, ఐవీ వేరియంట్‌ రూ. 68,336గా ఉంది. ఇదిలా ఉంటే ఈ ల్యాప్‌టాప్‌ భారత మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి రానున్నదన్న విషయంపై షావోమి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..