Breathalyzer: మీరు ఆల్కహాల్ తీసుకున్నారని బ్రీత్ ఎనలైజర్‌కు ఎలా తెలుస్తుంది?.. నోటి నుంచి వచ్చే వాసనను ఎలా గుర్తు పడుతుందో తెలుసా..

బ్రీత్ ఎనలైజర్ మెషిన్ ఎవరైనా మద్యం తాగి ఉన్నారా లేదా అని చెక్ చేసేందుకు ఉపయోగించే మెషిన్.. ఈ యంత్రానికి మద్యం తాగిన సంగతి ఎలా తెలుస్తుంది..? మద్యం తాగిన తర్వాత నోటి వాసన ఎందుకు వస్తుంది? ఇలాంటి ఆసక్తికరమైన చాలా విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..

Breathalyzer: మీరు ఆల్కహాల్ తీసుకున్నారని బ్రీత్ ఎనలైజర్‌కు ఎలా తెలుస్తుంది?.. నోటి నుంచి వచ్చే వాసనను ఎలా గుర్తు పడుతుందో తెలుసా..
Breathalyzer
Follow us
Sanjay Kasula

|

Updated on: Oct 29, 2022 | 7:40 PM

రోజంతా పనిఒత్తిడిలో గడిపాక.. సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని బీర్ తాగడమో లేదా ఒక గ్లాస్ వైన్ తాగడమో చేస్తుంటారు కొందరు. కొందరు పార్టీ పేరుతో.. బాధ పేరుతో ఇలా ఏదో అకేషన్‌తో మద్యం సేవిస్తుంటారు. అయితే అతి ఏదైనా మంచిది కాదు. ఎంతోమంది తప్పుగా భావించే మద్యం తాగడం కూడా మితంగా తాగడం మంచిదే. ఎక్కువగా మద్యం తాగితే, శరీరానికి ఎంత చెడ్డదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎక్కువగా మద్యం తాగితే, కాలేయం దెబ్బతింటుంది. ఈ మధ్యకాలంలో దేశంలో చాలా మంది మద్యం సేవించేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. వీరిలో కొందరు కొన్ని సందర్భాలలో మాత్రమే తాగుతారు. మద్యం సేవించిన తర్వాత నోటి నుంచి వచ్చే మద్యం వాసన చుట్టుపక్కల వారి మూడ్ పాడుచేస్తుంది. చాలా సార్లు, మరుసటి రోజు ఉదయం లేచిన తర్వాత కూడా మద్యం సేవించిన తర్వాత, ఈ దుర్వాసన నుంచి బయటపడటం సాధ్యం కాదు.

ఈ వాసనను ఆపడానికి సాధారణంగా చూయింగ్ గమ్, మింట్ గ్రీన్ టాబ్లెట్లు లేదా పుదీనా టోఫీని తింటారు. చాలా మంది చాలా అజాగ్రత్తలు తీసుకుంటారు. మద్యం సేవించిన తర్వాత కూడా వారు డ్రైవ్ చేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది. ప్రమాదకరమైనది మాత్రమే కాదు చట్టవిరుద్ధం. ఇలాంటి పరిస్థితుల్లో పట్టుబడినప్పుడు బ్రీత్ ఎనలైజర్ అనే మిషన్ సహాయంతో పరీక్షిస్తారు ట్రాఫిక్ పోలీసులు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే.. ఆల్కహాల్ తాగిన తర్వాత నోటి వాసన,  ఒక వ్యక్తి మద్యం తాగినట్లు బ్రీత్ ఎనలైజర్ మెషిన్‌ ఎలా గుర్తు పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

మద్యం సేవించిన తర్వాత నోటి వాసన ఎందుకు వస్తుంది

నోటి నుంచి దుర్వాసన ఎందుకు వస్తుందో సులభమైన భాషలో అర్థం చేసుకుందాం. నిజానికి మనం ఆల్కహాల్ తాగినప్పుడు అది విషపూరితమైన పదార్థం అని తెలిసి మన శరీరం చురుగ్గా మారుతుంది. శరీరంపై దాని ప్రభావాన్ని తగ్గించడానికి మన కాలేయం చాలా కష్టపడాలి. ఆల్కహాల్‌లో కొంత భాగం మూత్రం ద్వారా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. ఆల్కహాల్ తాగడానికి శరీరంలో జీవక్రియ ప్రక్రియ కూడా ఉంది. దీని కారణంగా కొంత మొత్తం చెమట ద్వారా కూడా తొలగించబడుతుంది. ఈ విధంగా, మద్యం వాసన నోటి నుంచి మాత్రమే కాకుండా.. మొత్తం శరీరం నుంచి వస్తుంది. అయినప్పటికీ, చాలా పెద్ద మొత్తంలో ఆల్కహాల్ రక్త నాళాల ద్వారా మన రక్తంలోకి వస్తుంది. 

బ్రీత్ ఎనలైజర్ ఇలా చూపిస్తుంది 

నోరు బాక్టీరియా కూడా ఒక కారణం 

నోటి లోపల మిలియన్ల కొద్దీ బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు పెరుగుతూనే ఉన్నాయి. సౌలభ్యం కోసం, వాటిని రెండు వర్గాలుగా విభజించవచ్చు. మొదటిది మంచి బ్యాక్టీరియా, రెండవది చెడు బ్యాక్టీరియా. అయితే ఇందులోని మంచి బ్యాక్టీరియా నోటికి, శరీరానికి హాని కలిగించదు. కాని అదే చెడు బ్యాక్టీరియా మాత్రం ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. చెడు బ్యాక్టీరియా సంఖ్య పెరిగినప్పుడు అవి నోటి దుర్వాసనతో సహా అనేక వ్యాధులకు కారణమవుతాయి.

ఒక పరిశోధన ప్రకారం, మద్యం సేవించినప్పుడు నోటిలోని మంచి, చెడు బ్యాక్టీరియాల సమతుల్యత దెబ్బతింటుంది. మద్యం సేవించడం వల్ల శరీరంలో యాసిడ్ రిఫ్లక్స్ ఏర్పడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆల్కహాల్‌తో కడుపు కండరాలు రిలాక్స్ అయినప్పుడు కడుపులోపల జీర్ణమైన ఆహారంలో యాసిడ్ కలిపి గొంతు వరకు నిండినా నోటి నుంచి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!