Petrol Quality Check: పెట్రోల్ నాణ్యతపై అనుమానం ఉంటే ఇలా చెక్ చేయండి.. ఎటువంటి హాని ఉండదు
పెట్రోల్ కల్తీ ఉన్నట్లుగా అనుమానం ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా అని మీరు మోసానికి గురైనట్లు కాదు.. కాబట్టి ఇందుకు పరిష్కారం కూడా ఉంటుంది. మీ హక్కులు ఏంటో తెలుసుకోండి..
ఎలక్ట్రిక్ వెహికల్స్ విద్యుత్ వేగంతో దూసుకొస్తున్నాయి. మార్కెట్‌ను ఆక్రమించే రెడీ అవుతున్నాయి. అలా అని పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గడం లేదు. ప్రతి నెలా పెరుగుతూనే పోతోంది. మన దేశంలో ముడి చమురు లభ్యత తక్కువ. అందుకే మనం 80 శాతం దిగుమతి చేసుకుంటాం. క్రూడ్ రేటు, దిగుమతి సుంకాలు, రవాణా చార్జీలు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, డీలర్ మార్జిన్ ఇలాంటి ట్యాక్సులు అన్ని కలుపుకోవడం వల్ల పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మనం ఫిల్లిగ్ చేయించుకున్న పెట్రోల్ కల్తీ అని తక్కువగా వచ్చిందనే అనుమానాలు సహజం. తాము ఏదో ఒక పెట్రోల్ పంపులో మోసపోయామని లేదా ఏదైనా ఫ్యూయల్ స్టేషన్‌లో ఇంధనం నాణ్యత లేదని లేదా ఇంధన కొలత ఎక్కడో తక్కువగా ఉందని మీరు చాలా మంది చెప్పడం తరచుగా వింటూ ఉంటారు.. కొన్నిసార్లు మీరు కూడా ఎప్పుడూ అలా భావించి ఉండకపోవచ్చు. ఈ ఫిర్యాదుల్లో చాలా వరకు నిజం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలో చాలా మంది ఏమీ చేయరు. ఆ ఇంధన స్టేషన్‌కు వెళ్లడం మానేస్తారు.
కానీ అలాంటి పెట్రోల్ పంపులో ఇంధనాన్ని నింపుకోవడం మానేయడం కాదు మనం చేయాల్సింది. ఎక్కడైతే అనుమానం వచ్చిందో అక్కడే దానికి పరిష్కారం వెతుకాలి. కల్తీని ప్రశ్నించే హక్కు ప్రతి వినియోగదారుడికి ఉంటుంది. అయితే ఎలా పెట్రోల్ పంపు యాజమాన్యంను ప్రశ్నించాలి. ఇలా జరిగే మోసాల గురించి ఎలా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
పెట్రోల్ పంపులో కస్టమర్ హక్కులు ఏంటి..
- మీరు ఏదైనా ఇంధన స్టేషన్‌లో మీ వాహనంలో నింపుతున్న పెట్రోల్ లేదా డీజిల్, దాని నాణ్యతలో కొంత లోపం ఉందని మీరు భావిస్తే, ఇంధన నాణ్యతను తనిఖీ చేయడానికి మీకు పూర్తి హక్కు ఉంటుంది. దీని కోసం, మీరు పెట్రోల్ పంప్ ఉద్యోగి లేదా మేనేజర్ నుంచి పరీక్ష కోసం ఫిల్టర్ పేపర్‌ను అడగవచ్చు.
- పెట్రోల్ పంపులో మీకు అందించబడుతున్న ఇంధనం పరిమాణం సరైనది కాదని మీరు అనుమానం ఉంటే లీటర్ జార్ ద్వారా ఇంధనం.. ఖచ్చితమైన మొత్తాన్ని కొలవడానికి మీకు పూర్తి హక్కు ఉంటుంది.
- మీరు మీ వాహనంలో పెట్రోల్ లేదా డీజిల్ నింపినప్పుడల్లా, ధృవీకరించబడిన ఇంధన రశీదు లేదా నగదు మెమోను అడిగే హక్కు మీకు ఉంటుంది. దీనికి పెట్రోల్ పంప్ మేనేజ్‌మెంట్ నిరాకరించదు.
- మీరు పెట్రోల్ లేదా డీజిల్ కొనుగోలు చేసినప్పుడు, దాని సాంద్రత గురించి సమాచారాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. అది వెండింగ్ మెషీన్‌లో కనిపిస్తుంది. మీరు మెషీన్‌లో ఈ సమాచారం కనిపించకపోతే మీరు దాని గురించి ఫిర్యాదు చేయవచ్చు.
- ఇది కాకుండా, మీరు పెట్రోల్ పంపులో మీ కారు టైరుకు గాలి, టాయిలెట్, తాగునీరు, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి వంటి కొన్ని ఉచిత సౌకర్యాలను కూడా ఉచితంగా పొందవచ్చు.
మరిన్నిహ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం