AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartphones: ఫిబ్రవరిలో విడుదల కానున్న టాప్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో మొబైల్‌ తయారీ..

Smartphones: ఫిబ్రవరిలో విడుదల కానున్న టాప్‌ బ్రాండ్‌ స్మార్ట్‌ఫోన్లు ఇవే..
Smartphones
Subhash Goud
|

Updated on: Jan 16, 2023 | 1:07 PM

Share

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ల హవా కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. అత్యాధునిక ఫీచర్స్‌తో మొబైల్‌ తయారీ కంపెనీలు మార్కెట్లో కొత్త ఫోన్‌లను విడుదల చేస్తున్నాయి. మొబైల్‌ ప్రియులను మరింతగా ఆకట్టుకునేందుకు టెక్నాలజీ ఉపయోగించి కొత్త ఫీచర్స్‌తో ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే ఎన్నో కొత్త మోడళ్ల ఫోన్లు అందుబాటులోకి రాగా, ఫిబ్రవరి నెలలో మరికొన్ని స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయి. శామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, షియోమీ వంటి కొత్త బ్రాండ్‌లు పరిచయం చేయనున్నాయి కంపెనీలు. కొత్త సాఫ్ట్‌వేర్‌తో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి ఫిబ్రవరిలో విడుదలయ్యే కొత్త ఫోన్లు ఏవో తెలుసుకుందాం.

  1. శామ్‌సంగ్ గెలాక్సీ S23 సిరీస్: శామ్‌సంగ్‌ గెలక్సీ S23 సిరీస్‌ ఫోన్‌ మార్కెట్లో విడుదల కానుంది. ఫిబ్రవరి 1వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో కొత్త ఈ మొబైల్‌ను విడుదల చేయనున్నారు. ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23 ప్లస్, గెలాక్సీ S23 అల్ట్రా ఉన్నాయి. ఇవి ఆండ్రాయిడ్ 13, ఆస్ట్రోఫోటోగ్రఫీ, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్, బెస్ట్ డిస్‌ప్లే, OneUI 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది.
  2. వన్‌ప్లస్: ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌తో వన్‌ప్లస్ కంపెనీ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 11ని ఫిబ్రవరి 7న మార్కెట్లో విడుదల కానుంది. ఈ ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్‌తో వస్తుంది.ఈ స్మార్ట్‌ఫోన్ మెటల్ ఫ్రేమ్‌తో ప్రీమియం గ్లాస్ శాండ్‌విచ్ డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది అలర్ట్ స్లైడర్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కర్వ్డ్‌ 2K అమోలెడ్ స్క్రీన్‌, కస్టమ్ ఆక్సిజన్‌ఓఎస్ 13 స్కిన్‌,
  3. షియోమీ 13: షియోమీ తన తాజా 13 సిరీస్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లను MWC 2023లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ కంపెనీ షియోమీ 13, షియోమీ 13 ప్రో రెండింటినీ ప్రకటించే అవకాశం ఉంది. అత్యాధునిక ఫీచర్స్‌తో అందుబాటులోకి రానున్నాయి. ఇవి స్నాప్‌డ్రాగన్‌ 8 Gen 2 ప్రాసెసర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తాయి. ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు కూడా అత్యాధునిక టెక్నాలజీనతో మంచి ఫీచర్స్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
అందుకే రా పాకిస్తాన్ టీం అనేది.. క్యాచ్ వదిలేసి గొడవపడ్డ ఆటగాళ్లు
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
నో మొబైల్‌.. రోజుకు 10 గంటల చదువు.. UPSC టాపర్ సక్సెస్ స్టోరీ!
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
పాత బోగీలు, ఇంజిన్లను రైల్వేశాఖ ఏం చేస్తుందో తెలుసా..?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
మటన్ లేకుండా మటన్ కర్రీ ఎలా వండాలో తెలుసా?
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
ఒకే వయసు.. ఒకే మార్కులు.. కానీ కాలేజీ చదువులో భారీ వ్యత్యాసం..
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
చికెన్‌, గుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయా? కారణం ఏంటో తెలుసా..?
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
భార్యకు ద్రోహం చేశా.. క్షమించండి: జెన్సెన్ హువాంగ్
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
IPL 2027లో మూడు జట్లకు కొత్త కెప్టెన్లు.. ఆ ముగ్గురు ఎవరో తెలుసా?
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
కాంక్రీట్ నేలపై పచ్చి గుడ్డును పగలకుండా ఎలా పడేయాలి? UPSC ప్రశ్న
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..
చేయూత పింఛన్ స్టేటస్ చెక్ చేసుకోవడం సింపుల్.. ఆన్‌లైన్‌లో ఇలా..