RGUKT Basar Faculty Jobs 2023: బీటెక్/ఎంటెక్ అర్హతతో.. బాసరా ఆర్‌జీయూకేటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం..
తెలంగాణ రాష్ట్రంలోని బాసర - రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ).. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు..
తెలంగాణ రాష్ట్రంలోని బాసర – రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ).. గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఎంటెక్/ఎంఈ/మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఆసక్తి కలిగిన వారు జనవరి 28, 2023వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి నేరుగా హాజరు కావచ్చు. రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ లేదా రెండింటి ఆధారంగానైనా ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.30,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
అడ్రస్..
RGUKT-Basar Campus, Basar (Village & Mandal), Nirmal(District), Telangana.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.