China New Year 2023: చైనా నూతన సంవత్సరం ఈ రోజే.. కుందేలు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టిన డ్రాగన్‌ దేశం..

చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈ రోజు (జనవరి 22) చైనీస్ న్యూ ఇయర్. చంద్రమానం ఆధారంగా ఈ రోజును గుర్తిస్తారు కాబట్టి దీనికి లూనార్ న్యూఇయర్ అని పేరు. సాధారణంగా..

China New Year 2023: చైనా నూతన సంవత్సరం ఈ రోజే.. కుందేలు నామ సంవత్సరంలోకి అడుగుపెట్టిన డ్రాగన్‌ దేశం..
Lunar New Year 2023
Follow us

|

Updated on: Jan 22, 2023 | 3:55 PM

చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఈ రోజు (జనవరి 22) చైనీస్ న్యూ ఇయర్. చంద్రమానం ఆధారంగా ఈ రోజును గుర్తిస్తారు కాబట్టి దీనికి లూనార్ న్యూఇయర్ అని పేరు. సాధారణంగా జనవరి 21 నుంచి ఫిబ్రవరి 20 మధ్య వస్తుంది. ఈసారి జనవరి 22న వచ్చింది. అందువల్లనే చైనాలో నూతన సంవత్సరానికి ప్రత్యేక తేదీ అంటూ ఉండదు. కుందేలు నామ సంవత్సరం చైనాలో ఆదివారం నుంచి ప్రారంభమయ్యింది. దీంతో అక్కడ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నా భయాలన్నీ పక్కనబెట్టి ఆనందోత్సవాల్లో మునిగిపోయారు. చైనా ప్రభుత్వం క్వారంటైన్, లాక్‌డౌన్ ఆంక్షలను ఎత్తేయడంతో లూనార్ న్యూఇయర్‌ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్న చైనీస్ ప్రజలందరు స్వదేశానికి చేరుకుని అట్టహాసంగా పండుగను ఆచరిస్తున్నారు. బీజింగ్‌లో సంబరాలు అంబరానంటుతున్నాయి.

12 రాశిచక్ర గుర్తులతో గ్రెగోరియన్ క్యాలెండర్‌లోని వివిధ నెలలతో అనుబంధించబడి ఉంటుంది. అలాగే ప్రతి చైనీస్ నూతన సంవత్సరానికి కూడా రాశిచక్రం ఉంటుంది. ఉదాహరణకు.. 2022 టైగర్ సంవత్సరం, 2023 కుందేలు సంవత్సరం, 2024 డ్రాగన్ సంవత్సరం, 2025 చైనీస్ న్యూ ఇయర్ ఆఫ్ ది స్నేక్‌ అవుతుంది.

చైనీయుల ఆచారం ప్రకారం.. నూతన ఏడాదిలోకి ప్రవేశించిన రోజున బాణాసంచాకాలుస్తూ సందడిగా జరపుకుంటారు. నియాన్ అనే రాక్షసుడు లూనార్‌ న్యూ ఇయర్‌ రోజున కనిపిస్తాడని, ఆ రాక్షసుడు ప్రజలు, పశువులను తినడానికి ప్రయత్నిస్తాడని.. ప్రజలు బాణసంచా కాల్చడం ద్వారా రాక్షసున్ని పారదోలుతారనే నమ్మకం ఉంది. అందుకే లూనార్‌ న్యూ ఇయర్‌ రోజున బాణా సంచా పెద్ద ఎత్తున కాలుస్తారు. చైనీస్ నూతన సంవత్సర వేడుకలు సాధారణంగా 16 రోజుల పాటు జరుగుతాయి. అంటే ఫిబ్రవరి 5న జరిగే లాంతరు పండుగతో చైనీస్ నూతన సంవత్సర వేడుకలు ముగుస్తాయి. ఆ రోజున చైనా ప్రజలు ఎరుపు రంగు లాంతర్లను వీధుల్లో, ఇళ్ల బయట, బహిరంగ ప్రదేశాల్లో వేలాడదీస్తారు. అంతేకాకుండా అందరూ ఎరుపు రంగు బట్టలు ధరించి, ఎరుపు రంగు గృహోపకరణాలతో ఇళ్లను అలంకరించుకుంటారు. ఎరుపు రంగు అదృష్టానికి సూచికగా చైనీయులు భావిస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.