AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US Firing: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మందికి పైగా మృతి..

కాలిఫోర్నియాలోని మోనిటరీ పార్క్‌ ప్రాంతంలో కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. కాల్పుల్లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మోనిటరీ పార్క్‌లో చైనా కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

US Firing: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. 10 మందికి పైగా మృతి..
Us Firing
Sanjay Kasula
|

Updated on: Jan 22, 2023 | 3:55 PM

Share

అమెరికాలో గన్‌కల్చర్‌ మళ్లీ ప్రజల ప్రాణాలు తీసింది. కాలిఫోర్నియాలో జరిగిన ఓ కార్యక్రమంలో విచక్షణారహితంగా కాల్పులు జరిగాయి. మోనిటరీ పార్క్‌ లో జరిగిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. కాల్పుల్లో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మోనిటరీ పార్క్‌లో చైనా కొత్త సంవత్సర వేడుకలు జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి మెషన్‌గన్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఆగంతకుడు లూనార్‌ న్యూ ఇయర్‌ వేడుకలను టార్గెట్‌ చేయడం సంచలనంగా మారింది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ 16 మందిని ఆస్పత్రికి తరలించారు. మోనిటరీ పార్క్‌ లోని నైట్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది కాల్పుల్లో గాయపడ్డ వాళ్లను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కూడా కాల్పులకు ధీటుగా సమాధానం చెప్పినట్లుగా తెలుస్తోంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు కాల్పుల ఘటన జరిగింది. మాంటెరీ పార్క్‌లో జరిగిన చైనీస్ లూనార్ న్యూ ఇయర్ వేడుకలో కాల్పులు జరిగాయి.

అయితే, ఓ వ్యక్తి భారీ మెషీన్‌ గన్‌తో అక్కడకు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు లాస్‌ఏంజెల్స్‌ టైమ్స్‌ పేర్కొంది. కాల్పులు జరిగిన స్ట్రీట్‌లోనే సియాంగ్‌ వాన్‌ చాయి అనే వ్యక్తి బార్బెక్యూ రెస్టారెంట్‌ నిర్వహిస్తున్నాడు. రాత్రి  10 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు అతడి చైనీస్ రెస్టారెంట్లోకి వచ్చి తలుపులు వేసుకున్నారని.. అయినా వారిని వదలకుండా వారిపై అతను కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

ఆ సాయుధుడి వద్ద భారీగా బులెట్లు ఉన్నట్లు ఘటన జరిగిన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అమెరికా మీడియాకు తెలిపాడు. సమీపంలోని డ్యాన్సింగ్‌ క్లబ్‌ లక్ష్యంగా అతడు దాడి చేసి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశాడు. కాల్పుల ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి  చేరుకుని.. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
తిరుపతి నుంచి వస్తుండగా ప్రమాదం..నలుగురు హైదరాబాదీలు మృతి
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
2025లో తెలంగాణలో పెరిగిన అవినీతి.. ఏ శాఖలో ఎక్కువ జరిగిందంటే..
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
నెలకు రూ.60 వేల ఆదాయం.. తక్కువ పెట్టుబడి!
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
గతంలో ఎన్నో తప్పులు చేశాను.. ఇప్పుడు అలాంటి పాత్రలే చేయాలనుంది..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి..
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
36 బంతుల్లో సెంచరీ..వైభవ్ సూర్యవంశీ ఊచకోతకు ప్రధాని మోదీ ఫిదా!
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
ఏపీకి కేంద్రం శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి పండగే
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
అద్దె భవనాల ఖాళీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
చేదు కాకరకాయలో చెప్పలేనన్నీ పోషకాలు,ఇలా వాడితే ఆ రోగాలన్నీ పరార్!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!
భారత కరెన్సీ మహిమ.. పేదల్ని ధనవంతులుగా మార్చేస్తోంది!