Robot: భవన నిర్మాణ పనులు చేస్తున్న రోబో.. ఇక రానురాను మనిషితో పనే ఉండదేమో! వీడియో వైరల్
ఓ నిర్మాణ కార్మికుడికి ఒక రోబో టూల్స్ డెలివరీ చేస్తున్న ఆసక్తికరమైన వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక స్ట్రక్చర్ పైన పని చేస్తున్న వ్యక్తికి టూల్స్ బ్యాగ్‌ని అందిచడానికి ఆ రోబోట్ తన మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటిని దాటుకుని వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.
మనిషే మనిషికి ప్రత్యామ్నాయాన్ని తయారుచేసుకుంటున్నాడు. ఒకవైపు అందుబాటులోకి వస్తున్న ఆధునిక సాంకేతికతో అంతా డిజిటలైజేషన్ అవుతోంది. ఆటోమేషన్ తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబెటిక్స్ వంటి వాటితో ఇక మనిషి అవసరం లేని వ్యవస్థల రూపకల్పన శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఓ నిర్మాణ కార్మికుడికి ఒక రోబో టూల్స్ డెలివరీ చేస్తున్న ఆసక్తికరమైన వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఒక స్ట్రక్చర్ పైన పని చేస్తున్న వ్యక్తికి టూల్స్ బ్యాగ్‌ని అందిచడానికి ఆ రోబోట్ తన మార్గంలో ఉన్న అడ్డంకులు అన్నింటిని దాటుకుని వెళ్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. ట్విట్టర్‌లో ఆ వీడియో పోస్ట్ చేసినప్పటి నుండి విపరీతమైన స్పందనలు అందుకుంది. ఏకంగా టెక్ బిలియనీర్ ఎలోన్ మస్క్ కూడా దీనిపై కామెంట్ చేశారు.
అసలు ఎవరిది ఆ వీడియో..
బోస్టన్ డైనమిక్స్ సృష్టించిన అట్లాస్ అనే రోబోట్ కు సంబంధించిన వీడియోను ఎంటర్‌ప్రైజ్ క్లౌడ్ కంపెనీ బాక్స్ సీఈఓ ఆరోన్ లెవీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. అట్లాస్ రోబోట్ తన సరికొత్త నెపుణ్యాలతో నెటిజనులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ అట్లాస్ తన చుట్టూ ఉన్న వస్తువులను బట్టి తన లక్ష్యాన్ని చేరుకునేందుకు తనలో తాను మార్పులు చేసుకుంటుంది. దీనికోసం రోబోట్ లోనిలోని లోకోమోషన్, సెన్సింగ్, అథ్లెటిసమ్ ను వినియోగించుకుంటుంది. ఆరోన్ లేవీ వీడియోకు రీట్వీట్ చేస్తూ ‘అంతా నార్మల్.. ఫ్రెండ్లీ రోబోట్.. దీని నుంచి ఒక్క తప్పునైనా ఊహించలేము’ అని రాశారు.
ఈ వీడియోనూ మీరూ చూసేయండి..
Totally normal and friendly robot, can’t imagine anything going wrong pic.twitter.com/EEkhg9AJer
— Aaron Levie (@levie) January 19, 2023
దీనిని జనవరి 19వ తేదీన పోస్ట్ చేయగా.. ఇప్పటికే 18 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. అవి ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. వేలకొలదీ లైక్స్, కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇదే క్రమంలో ఎలాన్ మస్క్ కూడా దీనిని షేర్ చేస్తూ ‘స్వీట్ డ్రీమ్స్’ అని కోట్ పెట్టారు.
Sweet dreams
— Elon Musk (@elonmusk) January 19, 2023
మరిన్ని సైన్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం..