RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్ బాలీవుడ్ మువీ కాదు.. అచ్చతెలుగు సినిమా’ నటికి క్లాస్ పీకిన నెటిజన్లు
టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆస్కార్ విజేత, ప్రముఖ హాలీవుడ్ నటి అయిన జేన్ ఫోండా ఆర్‌ఆర్‌ఆర్ మువీపై ప్రశంసలు కురిపించింది..
అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ల ఫిక్షన్ కథతో రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా ‘ఆర్‌ఆర్‌ఆర్’ మువీ బాక్సాఫీస్ వద్ద రూ.12 వందల కోట్లు కొల్లగొట్టింది. ఇక రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌ల నటన అభిమానులకు కనులవిందు చేసింది. ఇప్పటికే.. ‘గోల్డెన్ గ్లోబ్’, ‘ఆస్టిస్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్’, ‘బోస్టస్ సోసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’, ‘క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్’ వంటి పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను కైవసం చేసుకొంది. టాలీవుడ్ నుంచి హాలీవుడ్‌దాకా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆస్కార్ విజేత, ప్రముఖ హాలీవుడ్ నటి అయిన జేన్ ఫోండా ఆర్‌ఆర్‌ఆర్ మువీపై ప్రశంసలు కురిపించింది.
ఆర్‌ఆర్‌ఆర్ మువీ పోస్టర్‌ను ఇన్‌స్టాలో పోస్టు చేసి క్యాప్షన్‌గా ఈ విధంగా రాసుకొచ్చారు.. ‘ఆర్‌ఆర్‌ఆర్ మువీ నన్ను చాలా ఆశ్చర్య పరచిన మరొక చిత్రం. ఇంతకు ముందు లెస్లీ మువీని సిఫార్సు చేశాను. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఈ భారతీయ సినిమా ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అయింది. సామ్రాజ్యవాదం గురించి సీరియస్ చర్చించిన బాలీవుడ్ ఫిల్మ్ ఇది. నేను ట్రాన్స్‌ఫిక్స్ అయ్యాను’.. అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో జేన్ రాసుకొచ్చింది.
View this post on Instagram
జేన్ ఫోండా కామెంట్‌పై నెటిజన్లు స్పందిస్తూ.. ‘పబ్లిక్ ప్లాట్‌ఫాంలో భారతీయ చిత్రాన్ని ప్రశంసించడం సంతోషంగా ఉంది. ఐతే ఇది బాలీవుడ్ మువీ కాదు. బాలీవుడ్ అంటే హిందీ భాషా సినిమాలు. ఇది తెలుగు సినిమా.. ఇండియా సినిమాలంటే అంటే బాలీవుడ్ మాత్రమే గుర్తుకొస్తుందా? ఇండియాలో టాలీవుడ్ (తెలుగు), కోలీవుడ్ (తమిళ్), మాలీవుడ్ (మలయాళం), సాండల్‌వుడ్ (కన్నడ) వంటి అనేకమైన సినీ పరిశ్రమలున్నాయంటూ కాస్త గట్టిగానే క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ ఇది బాలీవుడ్ మువీ కాదు. దక్షిన భారతదేశంలోని తెలుగు చిత్రం అని వివరించాడు కూడా. ఐనప్పటికీ అంతర్జాతీయ గుర్తింపు పొందిన మన తెలుగు సినిమాను కొందరు బాలీవుడ్ మువీగా పేర్కొనడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.