AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishna Vamsi : ఆకలితో ఉన్నప్పుడు ఒక్క పూట అన్నం పెట్టినందుకు.. అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ

తనకు ఒక్క పూట అన్నం పెట్టాడు అని ఓ నటుడ్ని హీరోగా పెట్టి ఏకంగా సినిమా తీసాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Krishna Vamsi : ఆకలితో ఉన్నప్పుడు ఒక్క పూట అన్నం పెట్టినందుకు.. అతడిని హీరోని చేసిన కృష్ణ వంశీ
Krishnavamsi
Ram Naramaneni
|

Updated on: Jan 22, 2023 | 5:33 PM

Share

కృష్ణ వంశీ.. టాలీవుడ్‌లో ఉన్న మేటి దర్శకులలో ఒకరు. గులాబీ, నిన్నే పెళ్లాడత, సింధూరం, అంత:పురం, మురారి, ఖడ్గం, రాఖీ, చందమామ లాంటి కల్ట్, క్లాసిక్ సినిమాలను ఆయన అందించారు. నో డౌట్ ఆయన క్రియేటీవ్ డైరెక్టర్. పాత్రలను ఎంతో అందంగా చెక్కుతారు. కాగా డైరెక్టర్ కాకముందు కృష్ణవంశీ.. ఆర్జీవీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇప్పడంటే పర్లేదు కానీ.. ఒకప్పుడు సినిమా కష్టాలు మామలుగా ఉండేవి కాదు. రోజుకు ఒక్క పూట అన్నం దొరికిందంటే పండకే. చెప్పులు అరిగేలా ఆఫీసులు చుట్టూ తిరిగేతే కానీ ఎప్పటికో అవకాశాలు దక్కేవి కాదు. అలానే అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వకముందు కృష్ణవంశీ ఆకలి బాధలు అనుభవించారట. ఆ సందర్భాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరించారు కృష్ణవంశీ.

“అప్పటికీ భోజనం చేసి 5 రోజులు. కళ్లు మూతలు పడిపోతున్నాయి. ఇంకొక్క 5 నిమిషాలు అయితే పడిపోయే పరిస్థితి. రోడ్డు పక్కన ఫుట్‌పాత్‌పై నిల్చుని ఉన్న. ఊరెళ్లడం అంటే ఓడిపోవడమే. ఆ పరిస్థితి లేదు. సరిగ్గా ఆ సమయంలో బ్రహ్మజీ వచ్చాడు. భోజనం చేద్దాం రా అన్నాడు. మామలుగా అయితే నేను ఎవరికీ రుణపడను. ఎవరైనా అలా రమ్మని అడిగినా అవౌడ్ చేసేవాడిని. కానీ ఆకలి అలా చేసింది. బలహీన క్షణం. ఆ రోజు బ్రహ్మజీ పెట్టించిన ఫుడ్ తింటూ అనుకున్న.. ఏమిస్తే ఇతడి రుణం తీర్చుకోలను అని. ఆపై నేను డైరెక్టర్‌ అయ్యాక సింధూరం సినిమాలో బ్రహ్మజీని హీరోగా పెట్టడానికి అది కూడా ఒక కారణం. అతడికి మంచి నటుడు. నా ఫ్రెండ్. క్యారెక్టర్‌ని న్యాయం చేస్తాడు అనిపించాడు. అందుకే హీరోని చేశాను” అని కృష్ణవంశీ వెల్లడించారు.

Brahmaji

Brahmaji

కాగా కృష్ణ వంశీ డైరెక్ట్ చేసిన రంగమార్తాండ చిత్రం.. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుని.. తుది మెరుగులు దిద్దుకుంటుంది. రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..