Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. ప్రొగ్రామ్ లో పాల్గొని వస్తుండగా ఘటన..

టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. ఆమె కారుపై...

Singer Mangli: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. ప్రొగ్రామ్ లో పాల్గొని వస్తుండగా ఘటన..
Singer Mangli
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jan 22, 2023 | 3:41 PM

టాలీవుడ్ ఫేమస్ సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా.. ఆమె కారుపై కొందరు వ్యక్తులు రాళ్లదాడి చేశారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటి రోజు వేడుకల్లో భాగంగా.. సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. ప్రొగ్రామ్ ముగించుకుని వస్తున్న గాయని మంగ్లీ కారుపై కొంతమంది రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది. బళ్లారి ఉత్సవ కార్యక్రమంలో సింగర్ మంగ్లీ స్టేజ్ పై పాటలు పాడింది. తిరిగి వెళ్లేటప్పుడు ఆమెను చూసేందుకు స్థానిక యువకులు ముందుకొచ్చారు. వేదిక వెనక ఉన్న మేకప్ టెంట్ లోపలికి ప్రవేశించారు. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి వారిని అడ్డుకన్నారు.

కాగా.. కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. అయితే ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని ప్రముఖ యాంకర్ అనుశ్రీ కోరారు. అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మంగ్లీ తీరుపై నెటిజన్లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. మంగ్లీ కన్నడ ఇండస్ట్రీకి వచ్చి 2 సంవత్సరాలు దాటిందని, ఆమెకి కన్నడ అర్థం కాదు? ఇక్కడకు వచ్చి కన్నడలో మాట్లాడటానికి భయపడే ఆమెకు కన్నడలో ఎందుకు అవకాశం ఇస్తారో? అని ఫైర్ అయ్యారు.

ఇక హీరోయిన్ కూడా మంగ్లీ ఓ చిత్రంలో నటించారు. స్వేచ్ఛ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీలో మంగ్లీ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించి మెప్పించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!