Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam 2: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. కార్తీక దీపం సీరియల్ సీజన్ 2 త్వరలో..

ప్రధాన పాత్రల్లో నటించిన కార్తీక్, దీప, సౌందర్య , మౌనిత నుంచి పనిమనిషి ప్రియమణి వరకూ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కార్తీక దీపంకు గుడ్ బై పడుతుండడంతో.. మరో రెండు రోజులు పోతే ఎలా అని అప్పుడే ఆలోచించడం మొదలెట్టారు.

Karthika Deepam 2: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు గుడ్ న్యూస్.. కార్తీక దీపం సీరియల్ సీజన్ 2 త్వరలో..
Karthika Deepam 2
Follow us
Surya Kala

|

Updated on: Jan 22, 2023 | 4:31 PM

బుల్లి తెరపై సంచలనం కార్తీక దీపం సీరియల్.. తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు మరుపురాని జ్ఞాపకాలను ఇచ్చింది.  తెలుగు వారి గుండెల్లో కార్తీక దీపానికి మంచి చోటు ఉంది. వాస్తవానికి కార్తీక దీపం సీరియల్ అంటే తెలియని తెలుగు బుల్లి తెర ప్రేక్షకుడు లేదంటే అతిశయోక్తి కాదు. దేశ విదేశాల్లో తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం సందడి చేయని రోజు ఉండదు.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7.30 గంటలు అవుతుందంటే చాలు టివి స్క్రీన్స్ ముందు చేరుకుంటారు. అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈ ధారావాహిక లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కార్తీక్, దీప, సౌందర్య లకు ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి గొప్ప కథకి గొప్ప ముగింపు ఉంటుందన్న సంగతి తెలిసిందే.. గత కొన్నేళ్లుగా అలరించిన కార్తీక దీపం సీరియల్ ముగింపుకు చేరుకుంది. ఈ సీరియల్ లోని వంటలక్క కి సినీ హీరోయిన్ కి ఉన్నంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.

అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈ ధారావాహిక లో ప్రధాన పాత్రల్లో నటించిన కార్తీక్, దీప, సౌందర్య , మౌనిత నుంచి పనిమనిషి ప్రియమణి వరకూ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కార్తీక దీపంకు గుడ్ బై పడుతుండడంతో.. మరో రెండు రోజులు పోతే ఎలా అని అప్పుడే ఆలోచించడం మొదలెట్టారు. కార్తీక దీపం లేకుండా.. చూడకుండా..! కష్టమే అంటూ..తెగ బాధపడిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

కార్తీక దీపానికి .. అందులోని లీడ్‌ రోల్ వంటలక్కి, డాక్టర్ బాబుకి బాగా అలవాటు పడిన మహిళలు..  ఇప్పుడు ఆ సినిమా అయిపోతుండడంతో.. బెంగపెట్టుకున్నారు. వంటలక్క మళ్లీ వస్తే బాగుండు అంటూ.. ఆ దేవున్ని కోరుకుంటున్నారు. పూజలు, వత్రాలు చేస్తున్నారు.  అయితే ఇప్పుడు ఈ సీరియల్ యూనిట్ మళ్ళీ కార్తీక దీపం 2 మొదలెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

View this post on Instagram

A post shared by STAR MAA (@starmaa)

అవును మీరు విన్నది నిజమే.. ఈ కార్తీక దీపం టీం మరో సీరియల్‌ తో మన ముందుకు వస్తున్నారట. అందుకోసం ఇప్పటి నుంచే ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ స్టార్ట్ చేశారట. అచ్చొచ్చిన కార్తీక దీపం 2 టైటిల్‌తోనే ఈ సీరియల్‌ను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారట. అందులోనూ వంటలక్క.. డాక్టర్ బాబు ఉండనున్నారట. ఈ విషయం అటు ఇండస్ట్రీలోనూ సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. కార్తీక దీపం 2 పేరు నెట్టంతా మారుమ్రోగిపోతోంది. వంటలక్క మేనియా ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్‌ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి