AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shilpa Shetty: వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారా .. శిల్పా శెట్టి చెప్పిన ఈ యోగా పోజుని ట్రై చేసి చూడండి

శిల్పా శెట్టి తాజాగా షేర్ చేసిన పక్షి-కుక్క భంగిమ వ్యాయామ భంగిమ భుజాలు, చేతులను బలపరుస్తుంది. అయితే పక్షి-కుక్క భంగిమ ఏమిటి? ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.. 

Shilpa Shetty: వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతున్నారా .. శిల్పా శెట్టి చెప్పిన ఈ యోగా పోజుని ట్రై చేసి చూడండి
Shilpa Shetty Bird Dog Pose
Follow us
Surya Kala

|

Updated on: Jan 19, 2023 | 5:19 PM

బాలీవుడ్‌లో ఫిట్‌నెస్ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టే నటీమణుల్లో శిల్పాశెట్టి ఒకరు. తరచుగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫిట్‌నెస్ వీడియోలను పంచుకుంటుంది శిల్పా శెట్టి. యోగాసనాల గురించి తెలియజేస్తూ ఫిట్ నెస్ ప్రాముఖ్యతను నేటి యువతకు తెలియజేస్తూ ఉంటుంది. మోటివేషన్ పోస్ట్‌లను షేర్ చేస్తుంది. అయితే శిల్పా శెట్టి షేర్ చేసే యోగాసనాల్లో కొన్ని సంప్రదాయ భంగిమలు అయితే.. మరికొన్ని తన భిన్నంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో శిల్పా శెట్టి డాగ్ బర్డ్ పోజుని షేర్ చేసింది. పక్షి-కుక్క భంగిమను పంచుకుంటూ, శిల్పా .. “నేను సెట్‌లో ఉన్నప్పుడు కూడా ఎటువంటి సాకులు చెప్పకుండా యోగా శిక్షణ కొనసాగిస్తానని పేర్కొంది. “తాను తాజాగా షేర్ చేసిన యోగా భంగిమ ఉద్యోగం చేస్తూ చాలా బిజీగా ఉన్న వారి కోసం అని చెప్పింది. ఈ ప్రత్యేక వ్యాయామాన్ని ‘బర్డ్-డాగ్’ భంగిమ అంటారు. ఇది కండరాలు, పిరుదులు, భుజాలు, చేతులను బలపరుస్తుంది. ఇది సమతుల్యతను మెరుగుపరుస్తుంది.

తాను పనిలో బిజీగా ఉన్నప్పటికీ యోగాను కొనసాగిస్తున్నట్లు శిల్పాశెట్టి తెలిపింది. వ్యాయామానికి దూరంగా ఉండటానికి ఎవరైనా చెప్పే సాకు బిజీ బిజీ అని అంటారు. అయితే తాను తన వ్యాయామం చేయడానికి బిజీ అనే మాటను సాకుగా చూపానని పేర్కొంది. శిల్పా కు  ఫిట్‌నెస్‌పై ఉన్న ఈ మక్కువ చూసి శిల్పా అభిమానులు కూడా చాలా ఉత్సాహం చూపిస్తారు. కొందరు శిల్పా యోగాసనాలను అభ్యసిస్తారు.

శిల్పా శెట్టి తాజాగా షేర్ చేసిన పక్షి-కుక్క భంగిమ వ్యాయామ భంగిమ భుజాలు, చేతులను బలపరుస్తుంది. అయితే పక్షి-కుక్క భంగిమ ఏమిటి? ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

బర్డ్ డాగ్ అనేది శరీర సమతుల్యతను మెరుగుపరిచే ఒక సాధారణ కోర్ వ్యాయామం. ఇది వెన్నెముకకు చాలా మంచిది. ఈ వ్యాయామం నడుము నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఈ వ్యాయామం భంగిమ.. తుంటి , వెనుక కండరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. పక్షి-కుక్క యోగా పోజులో మొత్తం శరీరం ఉపయోగించబడుతుంది. ఈ యోగా పోజు వృద్ధులతో సహా అన్ని వయసుల వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వెన్నెముకను సరిచేయడానికి, నడుము నొప్పిని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.

బర్డ్ డాగ్ పోజ్ ఎలా చేయాలో తెలుసుకోండి

  1. శిల్పా తన పోస్ట్‌లో  వివరించిన ప్రకారం.. ముందు మీరు మీ చేతులు, కాళ్లపై ఉండేలా చూసుకోండి. డాగ్ భంగిమలో ఉండాలి.
  2. బర్డ్ డాగ్ వ్యాయామం చేయడానికి.. కుడి చేయి, ఎడమ కాలుని పైకి లేపి.. నేలకి సమాంతరంగా ఉంచండి. అనంతరం.. ఎడమ చేయి, కుడి కాలుతో చేయండి. ఈ సమయంలో శరీరం సమతుల్యతను కాపాడుకోవడం కోసం మీ కటిని ఒక వైపునకు వంచకుండా స్ట్రైట్ ఉంచాలి.
  3. ఒక సెకను వేచి ఉండండి..  ఆపై మళ్ళీ భంగిమ మార్చుకోండి. కుడి చేయి, ఎడమ కాలుని పైకి లేపి.. నేలకి సమాంతరంగా ఉంచండి. అనంతరం.. ఎడమ చేయి, కుడి కాలుని పైకి క్రిందికి లేపి మళ్ళీ నెలకు సమాంతరంగా ఉంచండి.

బర్డ్ డాగ్ వ్యాయామం ప్రయోజనాలు

  1. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం.. ఈ పక్షి కుక్క వ్యాయామం మీ కండరాలకు మేలు చేస్తుంది. ఇది స్థిరత్వం ఇస్తుంది. బర్డ్ డాగ్ వ్యాయామం వెన్నెముక కండరాలు, పొట్టలోని కండరాలను, పిరుదులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
  2. వెన్ను సమస్యలు, హైపర్‌మొబిలిటీ (మోకాలి నొప్పి, కీళ్ల నొప్పులు) ఉన్నవారికి ఈ వ్యాయామం మంచిది.
  3. ఈ పక్షి కుక్క భంగిమ వ్యాయామం నుంచి ఎక్కువ ప్రయోజనం పొందడానికి కండరాల కదలికల కంటే మీ శరీరం అంతటా కదిలేలా చేయండి.
  4. ఇది నడుము నొప్పిని తగ్గిస్తుంది. వెన్నునొప్పిని నయం చేయడానికి గొప్ప వ్యాయామం. పక్షి-కుక్క భంగిమ మీ వెన్నెముకకు ప్రయోజనకరంగా ఉంటుంది .. బలమైన కండరాలను అందిస్తుంది.
  5. మీరు వర్కవుట్ తర్వాత లేదా వ్యాయామానికి ముందు పక్షి-కుక్క భంగిమ వ్యాయామం చేయవచ్చు. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈ వ్యాయామం చేయవచ్చు. ఇది దిగువ వీపుకు , వెన్నెముకకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..