AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajamouli- James cameron: జక్కన్న మీద పొగడ్తల వర్షం కురిపించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్

ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నెటిజన్లతో పంచుకుంది. దీనిపై పలువురు స్పందిస్తూ..భారతీయ సినిమాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ కొనియాడుతున్నారు. 

Rajamouli- James cameron: జక్కన్న మీద పొగడ్తల వర్షం కురిపించిన హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్
Rajamouli, James Cameron
Rajeev Rayala
|

Updated on: Jan 22, 2023 | 8:18 AM

Share

దర్శకధీరుడు రాజమౌళికి హాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ అదిరిపోయే ఆఫర్‌ ఇచ్చారు. ఆర్‌ఆర్‌ఆర్‌ చూసి ఫిదా అయిన ఆయన భవిష్యత్తులో ఎప్పుడైనా జక్కన్నకు హాలీవుడ్‌లో సినిమా చేసే ఉద్దేశం ఉంటే తనని సంప్రదించాలని కోరారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వీడియోను తాజాగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌ నెటిజన్లతో పంచుకుంది. దీనిపై పలువురు స్పందిస్తూ..భారతీయ సినిమాకు దక్కిన గొప్ప గౌరవం అంటూ కొనియాడుతున్నారు.

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో జేమ్స్‌ కామెరూన్‌ను రాజమౌళి కలిసిశారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి వీరిద్దరూ చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈ సినిమా తనకెంతో నచ్చిందంటూ ఇందులోని పలు సీన్లను కామెరూన్‌ వివరణాత్మకంగా జక్కన్నకు చెప్పారు. ఈ చిత్రాన్ని కామెరూన్‌ రెండుసార్లు చూసినట్లు ఆయన సతీమణి సుజీ కామెరూన్‌ వెల్లడించారు. వీరిద్దరి మాటలతో రాజమౌళి అమితానందం పొందారు. ఈ మొత్తం సంభాషణకు సంబంధించిన ఓ స్పెషల్‌ వీడియోను RRR టీమ్‌ శనివారం విడుదల చేసింది.

హాలీవుడ్‌లో కామెరూన్‌ తీసిన టెర్మినేటర్‌, అవతార్‌,టైటానిక్‌ సినిమాలు చూశానని, అవి తనలో స్ఫూర్తి నింపాయని రాజమౌళి ఆయనతో చెప్పారు. ఆ వెంటనే స్పందించిన కామెరూన్‌, మీరు తీసిన సినిమాలు, అందులోని పాత్రలు చూస్తుంటే విభిన్నమైన అనుభూతి కలిగిందని తెలిపారు. నిప్పు, నీరు, కథ..ఇలా ఒకదాని తర్వాత మరొకటి మీరు చూపించిన విధానం, బ్యాక్‌గ్రౌండ్‌ స్టోరీని చెప్పిన తనకెంతో నచ్చిందన్నారు కామెరూన్‌. ఈ పొగడ్త తనకు అవార్డులకంటే ఎక్కువని రాజమౌళి ఆయనకు థ్యాంక్స్‌ చెప్పారు.

Follow Us
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
ఏసీబీకి వలలో ఎంపీడీవో.. సంబరాలు చేసుకుంటున్న బాధితులు..!
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
అరుదైన యోగం.. వీరి జీవితాల్లో ఊహించని టర్నింగ్ పాయింట్..
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
ఏం సినిమా రా బాబూ.. 6 కోట్లతో తీస్తే 2143 కోట్లకు పైగా కలెక్షన్స్
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
చికెన్ vs పనీర్: ఆరోగ్యానికి ఏది బెస్ట్..? ఎందులో ప్రోటీన్ ఎక్కువ
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
జాహ్నవి ఎక్కడ..? కష్టంగా మారిన సెర్చ్‌ ఆపరేషన్‌
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
ఇండస్ట్రీలో పెద్ద నటి.. చావు బతుకుల మధ్య ఉండగా ఎవరు వెళ్లలేదట..
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
మైలేజ్ కింగ్ అంటే ఇదే.. 70 కిలోమీటర్ల మైలేజ్..ధర కేవలం రూ.80 వేలే
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
నూనె వాడకుండా 2 నిమిషాల్లో అప్పటికప్పుడు చేసుకునే హెల్తీ రెసిపీ
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..
అన్నను మించి.. వైభవ్ సూర్యవంశీ తమ్ముడా మజాకా..