సామాన్యుడి జేబుకు చిళ్లు.. త్వరలో పెరగనున్న ఆర్టీసీ బస్‌ ఛార్జీలు..!

బస్‌ ఛార్జీల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు దృష్ట్యా నిర్వహణ ఖర్చు, నష్టాల లోటును భర్తీ చేసేందుకు..

సామాన్యుడి జేబుకు చిళ్లు.. త్వరలో పెరగనున్న ఆర్టీసీ బస్‌ ఛార్జీలు..!
UPSRTC Bus charges
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 22, 2023 | 4:35 PM

బస్‌ ఛార్జీల పెంపుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయాత్తమవుతోంది. పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు దృష్ట్యా నిర్వహణ ఖర్చు, నష్టాల లోటును భర్తీ చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ స్టేట్ రోడ్‌వేస్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఈ మేరకు బస్‌ ఛార్జీలను 25 పైసలు పెంచాలనే ప్రపోజలను ప్రభుత్వం ముందు ఉంచింది. ఇది ఆమోదం పొందితే ప్రతి 100 కిలోమీటర్లకు రూ.25 ఛార్జీ పెరగనుంది.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 12 వేల ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. బస్‌ ఛార్జీల ప్రపోజల్‌ ఆమోదం పొందితే.. ప్రస్తుతం ఆర్డినరీ బస్సులో కిలోమీటరుకు రూ.1.05లు ఛార్జీ ఉండగా, అది రూ.1.30లకు చేరుకుంటుంది. దీనిపై యూపీ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం (జనవరి 22) మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బస్సు ఛార్జీలను పెంచే ప్రతిపాదన తమ వద్ద ఉందన్నారు. 2020 నుంచి ఇప్పటి వరకు బస్సు చార్జీలు పెంచలేదన్నారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల, నిర్వహణ ఖర్చుల వల్ల రవాణా శాఖలో నష్టాలు నానాటికి పెరుగుతున్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి అది దాదాపు రూ. 250 కోట్లకు చేరుకుంటుందని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.