Budget EV Scooter: మధ్య తరగతి వారికి అందుబాటులో ఈవీ స్కూటర్..ధరెంతో తెలుసా?

ఈవీ స్కూటర్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి ప్రజలు వాటి జోలికే వెళ్లడం లేదు. ఇప్పుడు కొన్ని కంపెనీ కేవలం మధ్యతరగతి వారినే టార్గెట్ చేస్తూ తమ కొత్త స్కూటర్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇదే కోవలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ డెలిక్ట్ లెజియన్ తన కొత్త మోడల్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది.

Budget EV Scooter: మధ్య తరగతి వారికి అందుబాటులో ఈవీ స్కూటర్..ధరెంతో తెలుసా?
Legion Electric Scooter
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jan 22, 2023 | 8:33 PM

ప్రస్తుతం పట్టణ ప్రాంత ప్రజలు సొంత స్కూటర్ ను కొనే ముందు ఈవీ స్కూటర్ల వైపు కూడా ఓ లుక్కెస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ ధరల దెబ్బకు ఈవీ వైపు మొగ్గు చూపుతున్నారు. గత రెండేళ్లుగా దేశంలో పెరుగుతున్న ఈవీ స్కూటర్ల అమ్మకాలు ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయి. అయితే ఈవీ స్కూటర్ల ధరలు కొంచెం ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి ప్రజలు వాటి జోలికే వెళ్లడం లేదు. ఇప్పుడు కొన్ని కంపెనీ కేవలం మధ్యతరగతి వారినే టార్గెట్ చేస్తూ తమ కొత్త స్కూటర్లను మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. ఇదే కోవలో ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ కంపెనీ డెలిక్ట్ లెజియన్ తన కొత్త మోడల్ ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. కేవలం రూ.62, 490 రేట్ తో ఇది అందుబాటులో ఉండనుంది. ఈ మోడల్ లో హై ఎండ్ ధర కూడా కేవలం రూ.88, 990. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్ల గురించి కూడా ఓ సారి తెలుసుకుందాం.

ఈ స్కూటర్ లో 60.8 వీ, 30 ఏహెచ్ కెపాసిటీ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అలాగే 250 డబ్ల్యూ పవర్ బీఎల్ డీసీ మోటర్ తో వస్తుంది. కంపెనీ బ్యాటరీపై 3 సంవత్సరాలు, మోటార్ పై 1 సంవత్సరం వ్యారెంటీ కూడా ఇస్తుంది. అలాగే ఈ స్కూటర్ ను ఓ సారి చార్జి చేస్తే 70 నుంచి 100 కిలోమీటర్ల మైలేజ్ ను ఇస్తుంది. అలాగే గంటకు 25 కిలోమీటర్ల గరిష్ట స్పీడ్ తో వెళ్తుంది. ఈ స్కూటర్ ముందు చక్రానికి డిస్క్ బ్రేక్, వెనుక చక్రానికి కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో వస్తుంది. అలాగే ముందుభాగంలో  హైడ్రాలిక్ టెలీస్కోపిక్ సస్పెన్షన్, వెనుకభాగంలో హైడ్రాలిక్ స్ప్రింగ్ మోనోషాక్ సస్పెన్షన్ తో వస్తుంది. అలాగే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రిమోట్ స్టార్ట్, పుష్ బటన్ స్టార్ట్, డిజిటల్ ఇన్సుట్రుమెంటల్ కన్సోల్, యాంటీ థెఫ్ట్ అలారం, యూఎస్ బీ చార్జింగ్ పోర్టు, డిజిటల్ స్పీడో మీటర్, డిజిటల్ ట్రిప్ మీటర్, సెంట్రల్ లాకింగ్ కీలెస్ స్టార్ట్, అండ్ స్టాప్, ఫైండ్ మై ఇలా అనేక ఫీచర్లతో వస్తుంది. అలాగే ఎల్ఈడీ హెడ్ లైట్, టెయిల్ లైట్ వంటి ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. మరి బడ్జెట్ లో ఈవీ కొనాలనుకునే వారికి ఈ స్కూటర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..