Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో సంచరించనున్న గురువు.. ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా

గురు రాశి మార్పు 2023 సంవత్సరంలో ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మేషరాశిలో సంచరించనున్నాడు. మేషరాశిలో బృహస్పతి సంచారము ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది.

Guru Gochar 2023: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో సంచరించనున్న గురువు.. ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు.. అందులో మీరున్నారా
Guru Gochar 2023
Follow us

|

Updated on: Jan 22, 2023 | 6:15 PM

నవ గ్రహాల్లో శనీశ్వరుడు తర్వాత.. రెండవ అతిపెద్ద.. అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి.. కదలిక మారబోతోంది. వేద జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి శుభ గ్రహంగా పరిగణించబడుతుంది. బృహస్పతి ప్రజల జీవితంలో ధన ధాన్యాలను సుఖ సంతోషాలను  ఇస్తాడు. శని గ్రహం వలె.. బృహస్పతి కూడా నెమ్మదిగా కదిలే గ్రహం. శనీశ్వరుడు తన రాశిని రెండున్నరేళ్లకు మార్చుకుంటాడు.  బృహస్పతి ఒక రాశి నుంచి మరో రాశికి మారడానికి దాదాపు 13 నెలల సమయం పడుతుంది. ధనుస్సు , మీన రాశులకు బృహస్పతి అధిపతి. బృహస్పతి ఏ రాశిలో సంచరిస్తే.. ఆ రాశికి చెందిన వ్యక్తుల జీవితంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. గురువు ప్రభావం ప్రజల జీవితాల్లో చాలా కాలం ఉంటుంది. గురు రాశి మార్పు 2023 సంవత్సరంలో ప్రత్యేకంగా ఉండనుంది. ఎందుకంటే 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మేషరాశిలో సంచరించనున్నాడు. మేషరాశిలో బృహస్పతి సంచారము ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది. అయితే ఇలా గురువు తన సంచారాన్ని మార్చుకోవడం వలన కొన్ని రాశులకు అత్యంత శుభప్రదంగా భావిస్తున్నారు.

మేషరాశిలో బృహస్పతి సంచార సమయం నవ గ్రహాల్లో శుభ గ్రహంగా పరిగణించబడే బృహస్పతి ఏప్రిల్ 22, 2023న మేషరాశిలో సంచరించనున్నాడు. బృహస్పతి ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు.. అనంతరం గురువు తన సొంత రాశి నుంచి మేష రాశిలోకి అడుగు పెట్టనున్నాడు. ఇలా బృహస్పతి  సంచారము కొన్ని రాశులకు ప్రత్యేకంగా ఫలవంతంగా ఉంటుంది.

ఈ 3 రాశుల వారు అత్యధిక ప్రయోజనాలు పొందుతారు  మేష రాశి: ఏప్రిల్ 22 న.. రాశి వ్యక్తుల జాతకంలో మొదటి ఇంటిలో అంటే లగ్నానికి బృహస్పతి సంచరించనున్నాడు. మేష రాశి వారికి బృహస్పతి సంచారం చాలా శుభప్రదం.. ప్రయోజనకరంగా ఉంటుంది. బృహస్పతి సంచారంతో వీరు పురోగతి సాధిస్తారు. గౌరవం పెరుగుతుంది. ఉద్యోగస్థులు గౌరవించబడతారు. జ్యోతిషశాస్త్రంలో బృహస్పతి వైవాహిక జీవితంలో ఆనందం , శ్రేయస్సు కారకం. అటువంటి పరిస్థితిలో.. ఈ రాశి మార్పు వివాహితులకు మంచిదని రుజువు చేస్తుంది. అంతే కాకుండా భార్యాభర్తల మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది. మరోవైపు.. పెళ్లికాని యువతీ యువకులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు ఈ రాశి మార్పు చాలా శుభప్రదం అవుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో మంచి లాభాలు లభించే సూచనలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

కర్కాటక రాశి: దేవగురువు బృహస్పతి మార్పు కర్కాటక రాశి వారికి ఒక వరం వంటిది. డబ్బు లాభాలను పొందుతారు. పూర్వీకుల ఆస్తిలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారంలో ధన లాభాలను ఆర్జిస్తారు. గౌరవం లభిస్తుంది. మంచి హోదాను పొందుతారు. ఉద్యోగం కోసం ఏకకాలంలో మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారు ఏ పని చేసినా మంచి విజయం పొందే సూచనలున్నాయి.

మీన రాశి: మీనరాశిని వదిలి మేషరాశిలో బృహస్పతి అడుగు పెట్టనున్నాడు. దీంతో ఈ రాశిలో రెండవ ఇంట్లోకి సంచరించబోతున్నాడు. బృహస్పతి తన సొంత రాశి నుండి మేష రాశిలోకి అడుగు పెట్టడం శుభ ఫలితాలను తెస్తుంది. అధికంగా  డబ్బు లభించే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో సమతుల్యత ఉంటుంది. ఉన్నత విద్యకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారికి శుభం కలుగుతుంది. ఆకస్మికంగా ధనలాభానికి అవకాశాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలు ఏదైనా కొత్త ప్రణాళిక చేపడితే..  విజయవంతమవుతుంది, అందులో మంచి వృద్ధిని చూస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)