Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఉద్యోగంలో మీ హోదా మారే అవకాశం ఉంది.

Horoscope Today: ఈ రాశి ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ravi Kiran

Updated on: Jan 24, 2023 | 6:44 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం అవుతాయి. గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. మనసులోని కోరికలు ఒకటి రెండు నెరవేరుతాయి. ఉద్యోగంలో మీ హోదా మారే అవకాశం ఉంది. ఇతరత్రా కూడా మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ప్రయత్నంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. వృత్తి వ్యాపారాల వారికి లాభాలు పెరుగుతాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఆర్థిక పరిస్థితి చాలా వరకు బాగానే ఉంటుంది. అనవసర ఖర్చుల కారణంగా ఇబ్బంది పడతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఉద్యోగ పరంగా ఎంతగానో ప్రయోజనం పొందుతారు. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. డాక్టర్లు, లాయర్లు, ఐటి నిపుణులు, రియల్ ఎస్టేట్ వారికి సమయం చాలా బాగుంది. బంధువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సహాయం అందుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం అన్ని విధాలుగాను అనుకూలంగా ఉంటుంది. తెలిసిన వారితో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం కలుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగ పరంగా అంతా అనుకూలంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా చక్కబడుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో ముందుకు వెళతారు. ఐటీ రంగంలోని వారికి చాలా బాగుంటుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. ఇంటా బయటా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు, స్పెక్యులేషన్ వగైరాల వల్ల లాభం ఉంటుంది. రుణ సమస్యలను చాలావరకు తగ్గించుకుంటారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

పని ఒత్తిడి కారణంగా కొద్దిగా మనశ్శాంతి తగ్గుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అనవసర ఖర్చులు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. గ్రహ సంచారం కాస్తంత ప్రతికూలంగా ఉన్నందువల్ల ఎవరికీ వాగ్దానాలు చేయడం, హామీలు ఇవ్వడం మంచిది కాదు. ఒప్పందాల మీద సంతకాలు చేయడాన్ని వాయిదా వేసుకోండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు సామాన్యంగా ఉంటాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చేస్తున్న ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. తోబుట్టువులకు సహాయం చేస్తారు. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

కొద్దిగా వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆహార విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. సంపాదన పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు మంచి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అనవసర పరిచయాలకు, విలాసాలకు దూరంగా ఉండటం అవసరం. వృత్తి నిపుణులకు కాలం కలిసి వస్తుంది. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎంతో ఉదారంగా ఇతరులకు సహాయం చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి. అదనపు ఆదాయ మార్గాల కోసం ప్రయత్నిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సహకారం తీసుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులు మీ సలహాలకు, సూచనలకు విలువనిస్తారు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విలాసాలపై ఖర్చులు తగ్గించుకోవాలి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మంచి చోట పెళ్లి సంబంధం కుదరవచ్చు. కొందరు స్నేహితుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం పర్వాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)

చాలా విషయాల్లో సమయం అనుకూలంగా ఉంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో పరిస్థితులు మెరుగుపడతాయి. దాంపత్య జీవితంలో అపార్ధాలు తొలగి అన్యోన్యత ఏర్పడుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది.

కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

శని సంచారం కారణంగా ఉద్యోగ పరంగా పని భారం బాగా పెరుగుతుంది. అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. తప్పనిసరిగా పొదుపు పాటించాల్సి వస్తుంది. బందు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సమాజ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. తోబుట్టువులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కళా సాహిత్య రంగాలలోని వారు గుర్తింపు తెచ్చుకుంటారు. ఉద్యోగం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు అతి కష్టం మీద పూర్తి అవుతాయి. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి. నిరుద్యోగులకు మంచి జరుగుతుంది.

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌